https://oktelugu.com/

Heroine Trisha: ఆమె.. 60 ఏళ్లు పైబడిన హీరోలకు సరైన హీరోయిన్

Heroine Trisha: త్రిషకి 37 ఏళ్ళు. ఇంకా పెళ్లి కాలేదు. ఆమె యంగ్ హీరోయినే అని ఇన్నాళ్లు ఫీల్ అవుతూ వచ్చింది. కానీ మేకర్స్ అలా ఫీల్ అవ్వడం లేదు. దాంతో ఇక ‘సీనియర్’ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది ఈ భామ. ఎలాగూ కుర్ర హీరోల సినిమాల్లో ఛాన్స్ లు రావడం లేదు కాబట్టి.. చిన్నగా 60 ఏళ్లు పైబడిన హీరోలతో జతకడుతోంది త్రిష. ఆమె వరుసగా రెండు పెద్ద సినిమాల్లో సీనియర్ హీరోల సరసన హీరోయిన్ […]

Written By:
  • Shiva
  • , Updated On : March 10, 2022 / 05:26 PM IST
    Follow us on

    Heroine Trisha: త్రిషకి 37 ఏళ్ళు. ఇంకా పెళ్లి కాలేదు. ఆమె యంగ్ హీరోయినే అని ఇన్నాళ్లు ఫీల్ అవుతూ వచ్చింది. కానీ మేకర్స్ అలా ఫీల్ అవ్వడం లేదు. దాంతో ఇక ‘సీనియర్’ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది ఈ భామ. ఎలాగూ కుర్ర హీరోల సినిమాల్లో ఛాన్స్ లు రావడం లేదు కాబట్టి.. చిన్నగా 60 ఏళ్లు పైబడిన హీరోలతో జతకడుతోంది త్రిష. ఆమె వరుసగా రెండు పెద్ద సినిమాల్లో సీనియర్ హీరోల సరసన హీరోయిన్ గా నటించబోతుంది.

    Trisha

    బాలయ్య – పూరి కాంబినేషన్ లో రానున్న సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించనుంది. ఇంతకుముందు నయనతార, కాజల్ తో జతకట్టేందుకు సీనియర్ హీరోలు ఆసక్తి చూపేవారు. కానీ, ఇప్పుడు ఆ లీగ్ లో త్రిష, శృతి హాసన్ చేరారు. ఇప్పటికే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య హీరోగా ఇటీవల ఒక సినిమా ప్రారంభం అయింది. అందులో హీరోయిన్ శృతి హాసన్ ను హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది.

    మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిషను ఫైనల్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. కానీ, బాలయ్యకి జోడి శృతి హాసన్ ఖరారు చేశారు. ఇక తాజాగా చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమాలో మొదటి హీరోయిన్ గా త్రిష పేరే వినిపించింది. కానీ.. చివరకు శృతి హాసన్ ను ఫైనల్ చేశారు. అయితే, త్రిషకి మరో భారీ సినిమా వచ్చింది.

    మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్లో రూపొందుతోన్నచిత్రంలో త్రిషను హీరోయిన్ గా పెట్టుకుంటున్నారు. ఎలాగూ కాజల్ గర్భవతి, కాబట్టి.. ఆమె సినిమాలు ఒప్పుకోవడం లేదు. మరోపక్క నయనతార పారితోషికం భారీగా ఉంది. సో, మిగిలిన 30 ప్లస్ హీరోయిన్ లలో త్రిష, శృతి హాసన్ లే బాగా కనిపిస్తున్నారు. తమన్నా ఉంది గానీ, ఆమె బాగా ఫేడ్ అవుట్ అయ్యిపోయింది.

    Trisha

    మొత్తానికి అందరిలో కల్లా శృతి హాసన్ కొంచెం తెలివిగా సీనియర్ హీరోల సరసన నటించేందుకు ప్రీమియం రేట్ అడుగుతూ ముందుకు పోతుంది. ఇక రేటు ఫిక్స్ కానీ సినిమాలన్నీ త్రిష దగ్గరకు వస్తున్నాయి. ఎలాగూ త్రిష రెమ్యునరేషన్ డిమాండ్ చేసే పరిస్థితిలో లేదు కాబట్టి.. వచ్చిన సినిమాలు చేసుకుంటూ పోతుంది.

    .

    Tags