Bigg Boss 6 Telugu- Sri Satya: కంటెస్టెంట్ శ్రీసత్యపై సోషల్ మీడియాలో ఎక్కడలేని నెగిటివిటీ నడుస్తుంది. ఆమె ఆట తీరు ఏమాత్రం నచ్చడం లేదంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా శ్రీసత్య యాటిట్యూడ్, వెటకారం కంపరం తెప్పిస్తున్నాయి అంటున్నారు. మెజారిటీ ఆడియన్స్ ఆమెను ఎలిమినేట్ చేస్తే ఒక దరిద్రం వదులుతుందన్న అభిప్రాయం వెల్లడిస్తున్నారు. షో ప్రారంభంలో శ్రీసత్య ఎవరితో మాట్లాడకుండా గమ్ముగా ఉండేది. హౌస్లో అలా ఉంటే కుదరదని నాగార్జున క్లాస్ పీకాడు. ఆమె ఆటతీరుకు ఫస్ట్ వీక్స్ లోనే బ్యాగ్ సర్దడం ఖాయం అనుకున్నారు. అయితే ఆమె తెలివిగా ఎవరినో ఒకరిని వాడుకుంటూ సేవ్ అవుతూ వస్తుంది.

ఇంట్లో మోస్ట్ మానిప్యులేటర్ ఎవరంటే… శ్రీసత్య పేరు టక్కున చెబుతారు. అర్జున్ కళ్యాణ్ వీక్నెస్ ని కనిపెట్టి అతడిని బాగా వాడేసింది. అర్జున్ కళ్యాణ్ ని ఇరికించి ఆమె సేవ్ అయ్యింది. అర్జున్ కళ్యాణ్ ఎలిమినేట్ కావడానికి ప్యూర్ గా శ్రీసత్యనే కారణం. మనోడు వచ్చినప్పటి నుండి శ్రీసత్య నామస్మరణతో బ్రతికేశాడు. ఆమె కోసమే అన్నట్లు తన ఆటసాగింది. చివరకు జైలుపాలు కూడా అయ్యాడు. ఎలిమినేట్ అయ్యినందుకు కాదు శ్రీసత్యకు దూరమైనందుకు ఫీల్ అయ్యాడు. శ్రీసత్య కోసం చిన్నపిల్లాడిలా ఏడ్చాడు. శ్రీసత్యను నిజంగా ఇష్టపడిన అర్జున్ స్వచ్ఛమైన ప్రేమ చూపించాడు.
అర్జున్ ఎలిమినేట్ అయ్యాడో లేడో శ్రీహాన్ కి కనెక్ట్ అయ్యింది. ప్రస్తుతం ఆమె వలలో చిక్కుకుని విలవిలలాడుతున్నాడు. నాగార్జున శిక్ష కారణంగా గత వారం కెప్టెన్సీ కంటెండర్ ఛాన్స్ శ్రీహాన్ మిస్ అయ్యాడు. అయితే తన అవకాశం ఇంకొకరికి ఇవ్వొచ్చని చెప్పడంతో.. శ్రీసత్య కళ్ళతో సైగ చేసింది. వెంటనే శ్రీహాన్ శ్రీసత్య పేరు చెప్పాడు. ఇక శ్రీసత్యకి దగ్గరైనప్పటి నుండి మనోడి పై కూడా నెగిటివిటీ ఎక్కువైపోయింది. శ్రీసత్య-శ్రీహాన్ వెటకారం భరించలేకపోతున్నామని ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

నామినేషన్స్ నుండి తప్పించుకుంటూ వస్తున్న శ్రీసత్య ఈ వారం నామినేట్ అయ్యింది. దీంతో ఆమెను ఎలిమినేట్ చేయాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. అయితే ఈ వారం కూడా శ్రీసత్యను ఎలిమినేట్ చేయరు అనే వాదన వినిపిస్తోంది. నెక్స్ట్ ఫ్యామిలీ వీక్ నేపథ్యంలో వీల్ చైర్ కి పరిమితమైన శ్రీసత్య అమ్మను తీసుకొచ్చి ఎమోషన్ కురిపించి టీఆర్పీ తెచ్చుకోవాలనేది బిగ్ బాస్ ప్లాన్ అట. మెరీనాను ఎలిమినేట్ చేస్తే భార్యాభర్తలు దూరమవుతున్న సీన్స్ చూపించి ఎపిసోడ్ కి హైప్ తేవచ్చు అనుకుంటున్నారట. మరి చూడాలి 11వ వారం హౌస్ వీడేది ఎవరో.