Pawan Kalyan- Chandrababu Political Asceticism: ఏపీ సీఎం రేసులో ఉన్నదెవరు? అంటే జగన్, చంద్రబాబు పేరు వినిపించేది. కానీ ఇప్పుడు ఆ జాబితాలో పవన్ కళ్యాణ్ కూడా చేరారు. జగన్, చంద్రబాబు కంటే పవన్ పేరే స్ట్రాంగ్ గా వినిపిస్తోంది. ప్రెజెంట్ సీఎంగా జగన్, సుదీర్ఘ కాలం సీఎంగా పనిచేసిన చంద్రబాబుకు తోసిరాజని పవన్ ముందు వరుసలో వెళ్లడానికి అనేక కారణాలున్నాయి. పార్టీ స్థాపించి సుదీర్ఘ కాలం అవుతున్నా పవన్ పవర్ పాలిటిక్స్ కు దూరంగా ఉండడం, క్లీన్ ఇమేజ్ ఇప్పుడు కలిసివస్తోంది. అటు సామాజికవర్గ పరంగా కూడా పవన్ కు సపోర్టు పెరుగుతోంది. అటు కేంద్ర పెద్దలు కూడా పవన్ ను ప్రత్యామ్నాయ నాయకుడిగా చూడడం మొదలుపెట్టారు. గత ఎన్నికల తరువాత మిత్రుడిగా మారిన పవన్ ఏనాడూ అడ్వాంటేజ్ తీసుకోలేదు. పదవుల కోసం లాబియింగ్ చేయలేదు. ఏదైనా మాట్లాడితే రాష్ట్ర ప్రయోజనాల కోసం తప్ప.. ఏనాడూ వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించలేదు. విశాఖ వచ్చిన ప్రధాని మోదీ పవన్ ను ప్రత్యేకంగా కలవనవసరం లేదు. కానీ పిలిచి మరీ మాట్లాడారంటే కేంద్ర పెద్దల మదిలో ఏదో ఉందని అటు జగన్ , ఇటు చంద్రబాబు అనుమానించడం ప్రారంభించారు. అటు పవన్ కూడా ప్రధానిని కలిసిన తరువాత స్ట్రాటజీ మార్చారు.

మొన్నటివరకూ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వనని అన్న పవన్ .. ఇప్పుడు ఒక చాన్స్ అన్న స్లోగన్ మొదలుపెట్టాక చంద్రబాబులో కూడా పునరాలోచన ప్రారంభమైంది. అయితే పవన్ తాజా ప్రకటనతో తొలుత సంతోషపడిన వైసీపీ నేతలు కూడా క్రమేపీ డిఫెన్స్ లో పడిపోయారు. పవన్ ను ప్రత్యామ్నాయంగా చూపి కేంద్ర పెద్దలు పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేశారని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. అయితే పవన్ టీడీపీతో కలవాలి కానీ.. బీజేపీతో ఏంటని వామపక్ష నేతలు ప్రశ్నించేదాకా పరిస్థితి వచ్చింది. అయితే మొత్తానికి ఏపీ పొలిటిక్స్ లో పవన్ కళ్యాణే కార్నర్ అవుతున్నారు. సెంటరాఫ్ అట్రాక్షన్ అవుతున్నారు. మొన్నటి వరకూ పవన్ పర్యటనలను అడ్డుకున్న వైసీపీ సర్కారు.. ప్రధానితో పవన్ కలిసిన తరువాత వెనక్కి తగ్గింది. మొన్న విజయనగరం పర్యటనకు ఎటువంటి అడ్డంకులు సృష్టించలేదు. పైగా పోలీస్ బందోబస్తు నడుమ సజావుగా కార్యక్రమాన్ని జరిపించింది.
ఈ పరిణామాల క్రమంలో చంద్రబాబు రాజకీయ సన్యాసం సంకేతం చర్చకు కారణమవుతోంది. ఒకవేళ చంద్రబాబు కానీ ఈ నిర్ణయానికి కట్టుబడితే మాత్రం పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి సీఎం అయ్యే చాన్స్ వస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎవరు అవునన్న కాదన్నా వచ్చే ఎన్నికలు హోరాహోరీగా సాగనున్నాయి. టీడీపీ, జనసేన కూటమి కట్టినా.. విడివిగా పోటీచేసి త్రిముఖ పోటీ ఎదురైనా.. మూడు పార్టీలు సీట్లు పంచుకుంటాయి. అప్పుడు ఏదో రెండు పార్టీలు కలిసే ప్రభుత్వం ఏర్పాటుచేస్తాయి. వైసీపీ విధ్వంసపాలన చూసిన టీడీపీ జగన్ మరోసారి అధికారంలోకి రాకూడదని భావిస్తోంది. అదేకానీ జరిగితే టీడీపీని నామరూపాలు లేకుండా చేస్తారని చంద్రబాబుకు తెలుసు. అలాగని జనసేన వైసీపీతో కలిసే అవకాశం లేదు. అప్పుడు కేంద్రంలో మరోసారి అధికారంలోకి రాగలిగే అవకాశమున్న బీజేపీ చంద్రబాబు, జగన్ లను కాదని పవన్ కే సపోర్టు చేస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. ఎందుకుంటే వారిద్దరు కంటే పవనే నమ్మదగిన వ్యక్తి అని కేంద్ర పెద్దలు భావిస్తున్నారు. అందుకే పవన్ కే కేంద్ర పెద్దల ఆశీస్సులు ఉంటాయి.

జగన్ ను నిలువరించేందుకు చంద్రబాబు కూడా వెనక్కి తగ్గే అవకాశముంది. అందుకే తనతో పాటు పార్టీ శ్రేణులను కూడా చంద్రబాబు మానసికంగా సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా ఒక వేళ టీడీపీ ఓడిపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెబుతున్నారు. అంటే గౌరవప్రదంగా రిటైరవుతానని చెప్పినట్టేనని విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. అయితే చంద్రబాబు కేవలం వచ్చే ఎన్నికల్లో జగన్ ను ఇంటికి పంపించాలన్న కృతనిశ్చయంతో మాత్రమే పనిచేస్తున్నారు. మునపటిలా పరిస్థితులు లేవు.పైగా పవన్ లేనిదే అడుగు ముందుకు వేయలేని పరిస్థితి.అందునా పవన్ కు కేంద్ర పెద్దల సహకారం ఉండడంతో ఉమ్మడి శత్రువైన జగన్ ను నిలువరించడమే తన ముందున్న మార్గంగా చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే తాజాగా రాజకీయ సన్యాసం ప్రకటన చేసి.. అవసరమైతే పవన్ ను సీఎం పీఠంపై కూర్చోబెడతానని సంకేతాలిస్తున్నారు.