Sharwanand Vs Naveen Polishetty: ప్రస్తుతం యంగ్ హీరోల మధ్య విపరీతమైన పోటీ ఉంది. ఎవరు ఏ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమ సినిమాను సూపర్ సక్సెస్ గా నిలుపుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే సంక్రాంతి బరిలో స్టార్ హీరోలు ఉన్నప్పటికి యంగ్ హీరోల మధ్య పోటీ సైతం తీవ్రతరమవుతుంది. ఇక శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాను ఈనెల 14 వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడు. ఇక అలాగే నవీన్ పోలిశెట్టి సైతం ‘అనగనగా ఒక రాజు’ అనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను ఎలా మెప్పిస్తాయి అనేది చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఈ రెండు సినిమాలు కూడా ఫ్యామిలీ ఎంటర్ టైనర్లు గా తెరకెక్కాయి. ఇక ఈ రెండు సినిమాల్లో కామెడీ పుష్కలంగా ఉండబోతుంది.
శర్వానంద్ గత కొన్ని రోజుల నుంచి ఫ్లాపులతో సతమతమవుతుంటే నవీన్ పోలిశెట్టి మాత్రం సక్సెస్ లో ఉన్నాడు. ఇక ఈ సంక్రాంతికి ఎవరు విన్నర్ గా నిలుస్తారు. వీళ్ళిద్దరి మధ్య జరిగే తీవ్రమైన పోటీలో గెలిచేది ఎవరు? ఓడేది ఎవరు? అనేది తెలియాల్సి ఉంది…ఇక సంక్రాంతి సినిమాలు ఎన్ని ఉన్నా ఈ రెండు సినిమాల మధ్య పోటీ తీవ్ర తరమవ్వడానికి గల కారణం ఏంటి అంటే ఈ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి.
దానికి తోడుగా ఇద్దరు హీరోలు కూడా యంగ్ హీరోలు కావడం విశేషం…ఈ సినిమాలతో ప్రేక్షకులను ఎలా థియేటర్ కి రప్పిస్తారు. అలాగే వచ్చిన ప్రేక్షకులను ఎలా ఎంటర్ టైన్ చేస్తారు అనేది కీలకమైన అంశంగా మారింది. నవీన్ పోలిశెట్టి జాతి రత్నాలు సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. కాబట్టి అతని సినిమాని చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు.
శర్వానంద్ కెరియర్ స్టార్టింగ్ లో గొప్ప విజయాలను సాధించాడు. కానీ ఈ మధ్యకాలంలో అతను అనుకున్నట్టుగా సినిమాలు చేయలేకపోతున్నాడు… కానీ నారీ నారీ నడుమ మురారి సినిమా మాత్రం ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తుందనినే కాన్ఫిడెంట్ ని సినిమా యూనిట్ వ్యక్తం చేస్తున్నారు. ఇక వాళ్ళు అనుకున్నట్టుగానే శర్వానంద్ కి భారీ విజయం దక్కుతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది…