Pushpa 2 First Day Record: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల హవా ఎక్కువైపోయింది. పండగ సీజన్ వచ్చిందంటే చాలు మన స్టార్ హీరోలు వాళ్ళ సినిమాలతో వరుస సక్సెస్ లను సాధించడానికి సిద్ధమవుతుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రభాస్ హీరోగా వచ్చిన రాజాసాబ్ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా మొదటి రోజు 90 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టడం విశేషం… ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘పుష్ప 2’ సినిమా మొదటి రోజు 294 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టింది. దాంతో ఇప్పటివరకు ఇండియాలో అత్యధిక కలెక్షన్స్ ని రాబట్టిన సినిమాగా పుష్ప 2 నిలిచింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఆ రికార్డు బ్రేక్ చేయగలిగే సత్తా ఉన్న హీరోలు ఎవరు అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సక్సెస్ లను సాధించిన కూడా ఈ రికార్డును మాత్రం బ్రేక్ చేయలేకపోతున్నారు. కారణం ఏదైనా కూడా 294 కోట్లు మొదటి రోజు సంపాదించింది అంటే ఆ సినిమా ఎంత హైప్ తో రిలీజ్ అయిందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి అలాంటి సినిమాను బీట్ చేయగలిగే సినిమాలు ఈ మధ్యకాలంలో వస్తాయా? 2026వ సంవత్సరంలో ఏ సినిమా రికార్డును బ్రేక్ చేయబోతుంది అనేది తెలియాల్సి ఉంది.
ఇక ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాలు మాత్రం ఆ రికార్డ్ ను బ్రేక్ చేయడం చాలా కష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాలు ఒక మోస్తరు సక్సెస్ లను సాధిస్తాయి తప్ప భారీ రేంజ్ లో కలెక్షన్స్ ను కొల్లగొట్టే అవకాశాలైతే లేవు. ఇక రాజాసాబ్ సినిమా విషయంలో అది తేలిపోయింది.
కాబట్టి మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న ‘మన శంకర వరప్రసాద్’ సినిమా ఆ రేంజ్ కలెక్షన్స్ ని రాబట్టే అవకాశాలైతే లేవు. ఎందుకంటే చిరంజీవికి పాన్ ఇండియాలో పెద్దగా మార్కెట్ అయితే లేదు. కాబట్టి అతని సినిమాలను తెలుగు ప్రేక్షకులే ఎక్కువగా ఆదరించే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల అతని సినిమాకి రీజనబుల్ కలెక్షన్స్ వస్తాయి.
ఇక రవితేజ హీరోగా వస్తున్న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అలాగే శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’ నవీన్ పోలీశెట్టి హీరోగా వస్తున్న ‘అనగనగా ఒక రాజు’ సినిమాలు సైతం ఆ రికార్డులను బ్రేక్ చేసే అవకాశాలు లేవు. ఇక ఈ సంవత్సరంలో రిలీజ్ కాబోతున్న సినిమాలు ఏవైనా అ రికార్డును బ్రేక్ చేస్తాయో లేదో చూడాలి…