https://oktelugu.com/

‘శర్వానంద్’ ఓ వికలాంగుడు అట !

తెలుగు హీరోలందరిలో మొదటి నుండి వైవిధ్యమైన పాత్రలను చేస్తూ వస్తోన్న హీరో ‘శర్వానంద్‘. పాతికేళ్ల వయసులోనే నలభై ఏళ్ల వ్యక్తిగా నటించి మెప్పించిన టాలెంట్ శర్వాది. కానీ సెకెండ్ గ్రేడ్ స్టార్ ల వరుసలో ఇంతవరకూ శర్వానంద్ పేరు లేకపోవడం బాధే. ఆ మాటకొస్తే ఈ మధ్య శర్వానంద్ కి సాలిడ్ హిట్ వచ్చి చాలా కాలం అయిపోయిందనుకుంటా. గత కొన్ని సినిమాలుగా వరుస ప్లాప్ లతో శర్వానంద్ సతమతమవుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా కొత్త కథలను […]

Written By:
  • admin
  • , Updated On : August 6, 2020 / 05:03 PM IST
    Follow us on


    తెలుగు హీరోలందరిలో మొదటి నుండి వైవిధ్యమైన పాత్రలను చేస్తూ వస్తోన్న హీరో ‘శర్వానంద్‘. పాతికేళ్ల వయసులోనే నలభై ఏళ్ల వ్యక్తిగా నటించి మెప్పించిన టాలెంట్ శర్వాది. కానీ సెకెండ్ గ్రేడ్ స్టార్ ల వరుసలో ఇంతవరకూ శర్వానంద్ పేరు లేకపోవడం బాధే. ఆ మాటకొస్తే ఈ మధ్య శర్వానంద్ కి సాలిడ్ హిట్ వచ్చి చాలా కాలం అయిపోయిందనుకుంటా. గత కొన్ని సినిమాలుగా వరుస ప్లాప్ లతో శర్వానంద్ సతమతమవుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా కొత్త కథలను ఎన్నుకోవడం నిజంగా డేరింగే. ఆ డేర్ శర్వాలో ఉంది. అందుకే ఈ జనరేషన్ లో ఏ హీరో చేయలేని కథను శర్వా లైన్ లో పెట్టాడట. ఒక వికలాంగుడికి సంబంధించిన కథలో శర్వానంద్ హీరోగా నటించబోతున్నాడు.

    Also Read: భార్య బాధితుడిగా రవితేజ !

    ఇంతకీ ఇది తెలుగు సినిమా కాదట. డైరెక్ట్ తమిళ సినిమా. కాకపోతే తమిళంతో పాటు ఒకేసారి తెలుగులో కూడా తెరకెక్కబోతుంది. మరి తెలుగులో హిట్ లేని టైంలో శర్వానంద్ తమిళంలో సినిమా చేస్తున్నాడు. మరి అక్కడైన హిట్ వస్తోందా.. ఇప్పటికే గతంలో 2011లో వచ్చిన తమిళ్ సినిమా ‘ఎంగేయుమ్ ఇప్పోతుమ్’ (తెలుగులో జర్నీ)లో శర్వానంద్ ప్రధాన పాత్రలో నటించి తమిళ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు. అప్పట్లో తమిళ యంగ్ హీరోకు ఉన్నంత క్రేజ్ ఉండేది శర్వానంద్ కి తమిళంలో. అయితే తమిళ సినిమా చేసి దాదాపు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ ఇన్నేళ్ల తరువాత ఇప్పుడు తమిళ సినిమాలో నటించబోతున్నాడు.

    Also Read: ఇండస్ట్రీలో ఉప్మా యవ్వారాల పై కరోనా చెక్ !

    ఈ సినిమాకి మరో విశేషం ఏమిటంటే.. ఫేమస్ కొరియోగ్రఫర్ రాజు సుందరం డైరెక్షన్ చేస్తున్నాడు. రాజు సుందరం శర్వానంద్ కాంబినేషన్ అనగానే ఈ సినిమా పై తమిళ ప్రేక్షకుల్లో కూడా బాగానే ఆసక్తి క్రియేట్ అయ్యేలా ఉంది. కొన్నిరోజులుగా చర్చల దశలోనే ఉన్న ఈ చిత్రం తాజాగా ఫిక్స్ అయింది. మరి రాజు సుందరం అయినా శర్వానంద్ కి మంచి హిట్ ఇస్తాడేమో చూడాలి. అన్నట్లు కరోనా ఎఫెక్ట్ తగ్గాక ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.