Oke Oka Jeevitham Official Teaser : ‘టైం మిషన్’ కథలు ఎప్పుడూ అలరిస్తాయి.. ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తాయి. అప్పట్లో టెక్నాలజీ లేని సమయంలోనే బాలయ్య బాబు తీసిన ‘ఆదిత్య 369’ మూవీ వెండితెరపై అద్భుతాన్ని ఆవిష్కరించింది. అలాంటి కథలు ఎన్ని వచ్చినా ప్రేక్షకులు చూశారు. బ్రహ్మరథం పట్టారు.
Oke Oka Jeevitham – Official Teaser
ఇప్పుడు అలాంటి ఒక ప్రయోగాత్మక చిత్రం వచ్చేసింది. అదే ‘ఒకే ఒక జీవితం’. శర్వానంద్ హీరోగా.. వెన్నెల కిషోర్, ప్రియదర్శి కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ ‘టీజర్’ తాజాగా రిలీజ్ అయ్యింది. శ్రీకార్తీక్ దర్శకత్వంలో వచ్చిన ఈ టీజర్ చూస్తే ఇదొక ‘టైం మిషన్’పై నడిచే కథా కథనం అని అర్థమవుతోంది. కోలీవుడ్ ప్రముఖ నటుడు సూర్య ఈ టీజర్ ను విడుదల చేశాడు.
టైం మెషీన్ కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందినట్టు టీజర్ చూస్తే అర్థమవుతోంది. ముగ్గురు స్నేహితులు ఓ శాస్త్రవేత్తను నమ్మి భవిష్యత్తు నుంచి వర్తమానంలోకి ప్రయాణించి పడ్డ కష్టాలు..వారు ఎదుర్కొన్న ఇబ్బందులు.. చివరకు వాళ్లు ఎలా మళ్లీ భవిష్యత్తులోకి వచ్చారన్న కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందించారు. ఈ టీజర్ ఆసక్తిని పెంచేలా ఉంది.
మధ్యలో అక్కినేని అమల తల్లిగా.. శర్వానంద్ కొడుకుగా పండించిన సెంటిమెంట్ కూడా బాగానే ఎలివేట్ అయ్యింది. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో వచ్చే ఏడాది వేసవి లోపు విడుదల చేయనున్నారు.
-ఒకే ఒక జీవితం ట్రైలర్ ఇదీ