https://oktelugu.com/

Anchor Pradeep: ఆర్థిక కష్టాల్లో ఉన్నానంటూ ప్రదీప్ ని సాయం కోరిన నెటిజెన్.. మంచిమనసు చాటుకున్న యాంకర్!

Anchor Pradeep: మాచిరాజు టాలీవుడ్లో ఈ పేరు తెలియని వారు ఉండరు. ప్రదీప్ ఎన్నో టీవీ షోల్లో యాంకరింగ్ చేస్తూ ఎంతో సక్సెస్ ఫుల్ యాంకర్ గా కొనసాగుతున్నారు. టాలీవుడ్ లో మేల్ యాంకర్స్ చాలా తక్కువగా ఉన్నప్పటికీ ప్రదీప్ మాచిరాజు తన మాటల గారడీతో,కామెడీతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. ప్రదీప్ టీవీ షోలలో బాగా యాంకరింగ్ చేస్తూ ప్రజలను అలరించడమే కాకుండా తన మంచి హృదయంతో సాయం కోరిన వారికి చేతనైన సహాయం చేస్తూ అందరి […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 29, 2021 / 08:32 PM IST
    Follow us on

    Anchor Pradeep: మాచిరాజు టాలీవుడ్లో ఈ పేరు తెలియని వారు ఉండరు. ప్రదీప్ ఎన్నో టీవీ షోల్లో యాంకరింగ్ చేస్తూ ఎంతో సక్సెస్ ఫుల్ యాంకర్ గా కొనసాగుతున్నారు. టాలీవుడ్ లో మేల్ యాంకర్స్ చాలా తక్కువగా ఉన్నప్పటికీ ప్రదీప్ మాచిరాజు తన మాటల గారడీతో,కామెడీతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. ప్రదీప్ టీవీ షోలలో బాగా యాంకరింగ్ చేస్తూ ప్రజలను అలరించడమే కాకుండా తన మంచి హృదయంతో సాయం కోరిన వారికి చేతనైన సహాయం చేస్తూ అందరి అభినందనలు పొందుతున్నాడు.

    తాజాగా మరొకసారి ప్రదీప్ తన మంచి మనసును చాటుకున్నాడు. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు ఏ విషయాన్ని అయినా సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం అలవాటైపోయింది.. తద్వారా ప్రేక్షకులకు సెలబ్రిటీస్ కు తమ భావాలను వ్యక్తపరచడానికి సులభతరం అయ్యింది. ముఖ్యంగా వాట్సప్ ఇంస్టాగ్రామ్ ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలు ప్రేక్షకులకు , సెలబ్రిటీస్ కు వారధిగా మారాయి.

    తాజాగా ఒక నెటిజన్ ట్విట్టర్ ద్వారా యాంకర్ ప్రదీప్ ను సాయం కోరుతూ ట్వీట్ చేసారు.. అందుకు ప్రదీప్ స్పందించిన తీరు ఆయన్ను వార్తల్లో నిలిచేలా చేసింది. ఒక బీటెక్ విద్యార్థి తన కుటుంబానికి ఆర్థిక సాయం కావాలని కరోనా కారణంగా తన తండ్రి మృతి చెందటం వలన ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం సతమతమవుతోందని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నాడు.

    కరోనా కారణంగా తన తండ్రి చనిపోవటంతో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న తను , బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న తన అక్క ఆర్థికంగా నష్టపోయామని ట్విట్టర్ ద్వారా ప్రదీప్ ని ట్యాగ్ చేస్తూ ఆర్థిక సహాయం కోరాడు.. తన కుటుంబ పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి ప్రూఫ్ కూడా ఇస్తానని చెప్పి కొంతమేర ప్రదీప్ ని డబ్బు సహాయం కోరాడు.

    విద్యార్థి ట్వీట్ కు స్పందించిన ప్రదీప్ ఆ కుర్రాడి పరిస్థితి అర్థం చేసుకొని తన మంచి మనసుతో ” నా శక్తి మేర సహాయం చేస్తా బ్రదర్.. డీటైల్స్ పంపించి స్ట్రాంగ్ గా pఉండు ” అని రిప్లై ఇచ్చారు. ఈ సంఘటన ద్వారా ప్రదీప్ మరొక్కసారి తన మంచి మనసును చాటుకున్నాడని నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.