Pawan Kalyan- 2024 Elections: దేశ వ్యాప్తంగా బీజేపీ హవా నడుస్తోంది. కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ ఆ పార్టీ విస్తరిస్తోంది. ప్రాంతీయ పార్టీలను మట్టికరిపించి మరీ రాష్ట్రాలను హస్తగతం చేసుకుంటూ వస్తోంది. బలమైన ప్రాంతీయ పార్టీలు సైతం బీజేపీ ముందు మోకరిల్లాల్సిన పరిస్థితి. ప్రాంతీయ పార్టీల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. అటు విపక్షాల మధ్య అనైక్యత కూడా బీజేపీకి లాభిస్తోంది. అయితే ఇటీవల బిహార్ సీఎం నితీష్ కుమార్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తెలంగాణ సీఎం కేసీఆర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు సీఎం స్టాలిన్ వంటి వారు బీజేపీ వ్యతిరేక కూటమి దిశగా పావులు కదుపుతున్నారు. అయితే అదే తెలుగునాట విషయానికి వచ్చేసరికి మాత్రం వారికి పట్టు దొరకడం లేదు. మద్దతు లభించడం లేదు. చంద్రబాబు రాజకీయ సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అటు జగన్ తనపై కేసులు ఉన్న నేపథ్యంలో కేంద్రానికి సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. గడిచిన ఎన్నికల నుంచి పవన్ నేతృత్వంలోని జనసేన బీజేపీకి మిత్రపక్షంగా ఉంది. అయితే చంద్రబాబు, జగన్ ల కంటే పవన్ కు మంచి ఇమేజ్ ఉంది.పైగా క్లీన్ ఇమేజ్ తో పార్టీని నడిపిస్తున్నారు. ఏపీలో జనసేనకు గ్రాఫ్ పెరిగిన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోజాతీయ నాయకులకు పవన్ పై కన్నుపడంది. ఆయన్ను జాతీయ స్థాయిలో కూటమికి తెచ్చే ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది.
అయిటే ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు పెద్దలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అదేపనిపై ఉన్నారు. ఏపీలోజనసేనను అధికారానికి దగ్గర చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. అటు టీడీపీతో కలిసిన నడవడానికి నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అవసరమైతే బీజేపీతో కటీఫ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. గడిచిన ఎన్నికల తరువాత నుంచి మిత్రపక్షంగా ఉన్నా.. పవన్ ఎప్పుడు ప్రధాని మోదీని కలిసిన సందర్భాలు కూడా లేవు.
Also Read: JanaSena- Pawan Kalyan: జనసేన సర్వేలు: పవన్ కింగ్ మేకర్.. వైసీపీ పరిస్థితి ఇదీ.. ఏం తేలిందో తెలుసా?
పైగా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రంపై పవన్ ఏమంత నమ్మకంగా కూడా లేరు. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వం తప్పుడు విధానాలను కేంద్రం నియంత్రించకపోవడం కూడా పవన్ కు బాధేస్తోంది. ఈ పరిస్థితుల్లో బీజేపీకి దూరంగా జరగడమే మేలన్న అభిప్రాయంతో పవన్ ఉన్నట్టు టాక్ నడుస్తోంది. అదే సమయంలో గత ఎన్నికల్లో ఓటమి తరువాత జనసేనను వేరే పార్టీలో విలీనం చేస్తారని చాలామంది భావించారని.. అది జరగని పని అని కూడా తేల్చిచెప్పారు. తద్వారా బీజేపీ అగ్ర నాయకత్వానికి గట్టి సంకేతాలు పంపారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే జాతీయ స్థాయిలో పవన్ అంటే ఇష్టపడే నేతల్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ముందుంటారు. ఆయన ఆది నుంచి పవన్ వ్యవహార శైలిపై ఆసక్తి చూపుతుంటారు. బీజేపీకి వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాలను ఏకతాటిపైకి తెచ్చే సామర్థ్యం పవన్ కు ఉందని నమ్ముతుంటారు. ఏపీలో పవన్ కళ్యాణ్ క్రేజ్ కు ఫిదా అవుతుంటారు. వచ్చే జాతీయ ఎన్నికల్లో దక్షిణాదిలో పవన్ సీట్లు గెలిచి కీలక రోల్ పోషిస్తున్నాడని అభిప్రాయపడుతుంటారు. దక్షిణాదిలో క్రేజ్ గల హీరో పవన్. ఆయనతో ప్రచారం వల్ల బీజేపీకి లాభం. కానీ బీజేపీ వదిలేస్తే మాత్రం ప్రాంతీయ పార్టీలు పవన్ ను వాడుకోవాలని.. క్రేజ్ ను సొంతం చేసుకోవాలని చూస్తున్నాయి.కేసీఆర్, మమత, మమత, కేజ్రీవాల్ లాంటి వారితో పవన్ ను ఒప్పించి ఆయనను బీజేపీకి వ్యతిరేకంగా సాగాలని చూస్తున్నారు. సో ఇక్కడ టీడీపీతో కలిసినా కూడా పవన్ కీలక శక్తిగా ఎదిగుతారు. సీఎం కావచ్చు. కర్నాటకాలో కుమారస్వామి ఎపిసోడ్ నే ఉదాహరణగా తీసుకుంటున్నారు. మొత్తానికైతే 2024లో ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో పవన్ కీరోల్ పాత్ర పోషించే అవకాశమైతే మాత్రం ఉంది.