Homeఎంటర్టైన్మెంట్Sharwanand: ఆ హీరోయిన్ అయినా శర్వానంద్ కి హిట్ ఇస్తుందా? సెంటిమెంట్ రిపీట్ అయితేనే!

Sharwanand: ఆ హీరోయిన్ అయినా శర్వానంద్ కి హిట్ ఇస్తుందా? సెంటిమెంట్ రిపీట్ అయితేనే!

Sharwanand: హీరో శర్వానంద్ కి బ్యాడ్ టైం నడుస్తుంది. ఆయన హిట్ కొట్టి ఏళ్ళు గడిచిపోతున్నాయి. మంచి సబ్జెక్టులు ఎంచుకుంటున్నా.. హిట్స్ మాత్రం దక్కడం లేదు. ఆయన గత చిత్రం మనమే నిరాశపరిచింది. కంటెంట్ పరంగా పర్లేదు. ఓ పరభాషా చిత్రం స్ఫూర్తితో తెరకెక్కించారు. ఉన్నతమైన నిర్మాణ విలువలతో మూవీ చాలా రిచ్ గా తీశారు. తెలుగు జనాలకు ఈ కథ కొత్తదే అయినా, పెద్దగా ఎక్కలేదు. దాంతో శర్వానంద్ ఖాతాలో మరో ప్లాప్ పడింది. మరోవైపు ప్లాప్స్ లో కృతి శెట్టిని కూడా మనమే దెబ్బతీసింది.

Also Read: పూరి జగన్నాధ్ సీనియర్ నటి రమాప్రభ కి హెల్ప్ చేయడానికి కారణం ఏంటంటే..?

గట్టి కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్న శర్వానంద్, తన నెక్స్ట్ మూవీలో హీరోయిన్ గా లక్కీ గర్ల్ ని ఎంపిక చేసుకున్నాడు. ఆమె ఎవరో కాదు అనుపమ పరమేశ్వరన్. శర్వా 38లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. గతంలో వీరి కాంబోలో శతమానం భవతి మూవీ తెరకెక్కింది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఎమోషనల్ ఫ్యామిలీ లవ్ డ్రామా సూపర్ హిట్ అందుకుంది. శర్వానంద్ కెరీర్లో శతమానం భవతి మంచి చిత్రంగా నిలిచిపోయింది. శర్వానంద్-అనుపమ కెమిస్ట్రీ బాగా కుదిరింది. శర్వా 38లో అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న న్యూస్, ఫ్యాన్స్ లో కూడా జోరు నింపింది.

శతమానం భవతి సెంటిమెంట్ రిపీట్ అవడం ఖాయం అంటున్నారు. మరి అనుపమ పరమేశ్వరన్ హీరో శర్వానంద్ కి హిట్ ఇస్తుందో లేదో చూడాలి. దర్శకుడు సంపత్ నంది ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రాధామోహన్ నిర్మిస్తున్నారు. భీమ్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. అటు సంపత్ నంది కూడా ఫార్మ్ లో లేడు. ఆయన తెరకెక్కిన ఓదెల 2 ఇటీవల విడుదలైంది. తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీ నిరాశపరిచింది. పలు హిట్ చిత్రాల ఛాయలు ఓదెల 2లో కనిపించాయని సోషల్ మీడియాలో విమర్శలు వినిపించాయి.

ఒకప్పుడు టైర్ టు జాబితాలో నాని, విజయ్ దేవరకొండ లతో పోటీపడిన శర్వానంద్ అనూహ్యంగా రేసులో వెనుకబడ్డారు. ఆయనకు ఒక సాలిడ్ హిట్ పడితే కానీ మరలా ట్రాక్ లోకి దూసుకురాడు. అందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా శర్వానంద్ వరుస చిత్రాలు చేస్తున్నారు.

 

Also Read: ఫౌజీ మూవీలో ప్రభాస్ ఎలివేషన్స్ వేరే రేంజ్ లో ఉండబోతున్నాయా..?

RELATED ARTICLES

Most Popular