Sharwanand Biker movie first review: ఈ సంక్రాంతికి ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రం తో ప్రేక్షకుల ముందుకొచ్చి భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్న హీరో శర్వానంద్, ఇప్పుడు ‘బైకర్’ చిత్రం తో వచ్చే నెల 3న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని మేకర్స్ నిన్న ఒక పెద్ద ఈవెంట్ ని ఏర్పాటు చేసి విడుదల చేశారు. ఈ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. కానీ ఎక్కవ శాతం క్రికెట్ , ఫుట్ బాల్ , హాకీ క్రీడలను బేస్ చేసుకొని మాత్రమే తెరకెక్కాయి. బైక్ రేసింగ్ స్పోర్ట్ మీద ఒక్క సినిమా కూడా రాలేదు.
ఇప్పుడు ఆ బైక్ రేసింగ్ మీదనే ఈ చిత్రం తెరకెక్కింది. అయితే నిన్న రామానాయుడు స్టూడియోస్ లోని ఒక థియేటర్ లో ఈ చిత్రానికి సంబంధించిన ప్రివ్యూ షోని ప్రదర్శించారు మేకర్స్. ఈ షోకి సినీ ఇండస్ట్రీ కి చెందిన కొంతమంది ప్రముఖులతో పాటు, కొంతమంది మీడియా ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఈ షో చూసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రివ్యూస్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. తండ్రి కొడుకుల మధ్య ఎమోషన్స్ ని ఈ చిత్రం లో చాలా చక్కగా చూపించారని, సీనియర్ హీరో రాజశేఖర్ కి ఈ చిత్రం లో చాలా చక్కటి పాత్ర దొరికిందని అంటున్నారు. తన కొడుకుని బైక్ రేసర్ గా ఇంటర్నేషనల్ ఛాంపియన్ ని చేయడానికి రాజశేఖర్ పడిన తపన ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచిందని అంటున్నారు. శర్వానంద్ కి కూడా చాలా కాలం తర్వాత నటనకు మంచి ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కిందని అంటున్నారు ఈ చిత్రాన్ని చూసినవాళ్లందరూ.
Also Read: పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డి కాంబినేషన్ సినిమా ఆగిపోయినట్టేనా..? కారణాలు ఏంటంటే!
సినిమా కథ రీత్యా స్క్రీన్ ప్లే కాస్త స్లో గానే సాగుతుంది కానీ, బైక్ రేసింగ్ సన్నివేశాలు మాత్రం థియేటర్స్ లో గూస్ బంప్స్ అనుభూతిని కలిగిస్తుందని అంటున్నారు. బడ్జెట్ కూడా యూవీ క్రియేషన్స్ బ్యానర్ ఖర్చుకి ఎక్కడా వెనకాడకుండా, చాలా రిచ్ గా ఈ చిత్రాన్ని తీర్చి దిద్దారని సమాచారం. సౌండ్ క్వాలిటీ కూడా అదిరిపోయిందట. పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతున్న ఈ చిత్రం తో శర్వానంద్ మరో సారి భారీ హిట్ ని అందుకోబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. మన తెలుగు ఆడియన్స్ కూడా ఒక మంచి సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే సంక్రాంతి తర్వాత మన టాలీవుడ్ లో విడుదలైన ప్రతీ చిత్రం కమర్షియల్ గా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఇలాంటి సమయం లో ఈ రేంజ్ క్వాలిటీ సినిమాలు వస్తే ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడానికి సిద్ధంగా ఉన్నారు.
