https://oktelugu.com/

Manamey OTT: పెళ్లి కాకుండానే ఒకే ఇంట్లో హీరో హీరోయిన్ కాపురం… ఆ క్రేజీ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఓటీటీలో! ఇంట్రెస్టింగ్ డిటైల్స్

ఓటీటీలోకి ఓ డిఫరెంట్ లవ్ స్టోరీ రాబోతుంది. పెళ్లి కాకుండా ఓ జంట కలిసి ఒకే ఇంట్లో ఉండాల్సి వస్తుంది. వారి మధ్య ఏర్పడే గిల్లికజ్జాలు, లవ్, ఎమోషన్స్ ఆసక్తి రేపుతాయి. ఆ చిత్రం ఏమిటో చూద్దాం..

Written By:
  • S Reddy
  • , Updated On : August 10, 2024 / 05:24 PM IST

    Manamey OTT

    Follow us on

    Manamey OTT: శర్వానంద్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ రొమాంటిక్ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా మనమే. శర్వానంద్ కి జంటగా కృతి శెట్టి నటించింది. మనమే చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. జూన్ 7న వరల్డ్ వైడ్ మనమే చిత్రాన్ని విడుదల చేశారు. మనమే చిత్రానికి మిశ్రమ స్పందన దక్కింది. అయితే ఓ వర్గం ప్రేక్షకులు మనమే చిత్రాన్ని ఇష్టపడ్డారు. హీరో శర్వానంద్ ఓ భిన్నమైన సబ్జెక్టు ట్రై చేశాడు. మనమే విడుదలై రెండు నెలలు గడుస్తున్నా డిజిటల్ స్ట్రీమింగ్ కి రాలేదు. తాజాగా మనమే ఓటీటీ విడుదలపై సమాచారం అందుతుంది.

    మనమే చిత్ర డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. అనివార్య కారణాల వలన స్ట్రీమింగ్ ఆలస్యమైంది. ఎట్టకేలకు అమెజాన్ ప్రైమ్ మనమే చిత్రాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు వినికిడి. ఆగస్టు 16న మనమే అందుబాటులోకి వస్తుందట. ఇది శర్వానంద్ అభిమానులను సంతోషపరిచే వార్త అనడంలో సందేహం లేదు.

    మనమే చిత్ర కథ విషయానికి వస్తే… లండన్ లో ఉండే విక్రమ్(శర్వానంద్) ఎలాంటి బాధ్యత లేని ప్లే బాయ్. నచ్చినట్లు బ్రతుకుతూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అక్కడే ఉండే సుభద్ర(కృతి శెట్టి) చాలా పద్ధతిగల అమ్మాయి. వీరిద్దరి స్నేహితులు అనురాగ్, శ్వేత ప్రేమ పెళ్లి చేసుకుంటారు. దానితో పేరెంట్స్ వారిని దూరం పెడతారు. అనుకోకుండా ఒకరోజు ప్రమాదంలో అనురాగ్, శ్వేత కన్నుమూస్తారు.

    అనురాగ్, శ్వేతలకు ఓ పసి బాలుడు ఉంటాడు. పేరెంట్స్ మరణంతో ఆ బాలుడు అనాథ అవుతాడు. అనురాగ్, శ్వేత పేరెంట్స్ కూడా బాలుడు బాధ్యత తీసుకోవడానికి ముందుకు రారు. దాంతో ఇంగ్లాండ్ గవర్నమెంట్ బాలుడిని అనాధ బాలల గృహానికి తరలిస్తుంది. అప్పుడు విక్రమ్, సుభద్ర… ఆ పిల్లాడి బాధ్యత తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఓ నాలుగు నెలలు బాలుడిని వీరు జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది.

    ఈ క్రమంలో బాలుడితో పాటు ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటారు. విరుద్ధ స్వభావాలు కలిగిన విక్రమ్, సుభద్ర మధ్య తరచుగా గొడవలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా విక్రమ్ పిల్లాడి పోషణ తెలియక అనేక ఇబ్బందులు పడతాడు. పిల్లాడి కారణంగా కలిసిన విక్రమ్-సుభద్రల కథ ఎలా ముగిసింది? పిల్లాడి బాధ్యత చివరికి ఎవరు తీసుకున్నారు? అనేది మిగతా స్టోరీ.

    థియేటర్స్ లో మనమే చిత్రానికి ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కలేదు. కమర్షియల్ గా ఆడలేదు. కనీసం ఓటీటీలో అయినా సత్తాచాటుతుందేమో చూడాలి. శర్వానంద్ మనమే చిత్రం పై చాలా అసలే పెట్టుకున్నాడు. కానీ మనమే సైతం హిట్ టాక్ తెచ్చుకోలేదు. శర్వానంద్ హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. 2017లో వచ్చిన మహానుభావుడు అనంతరం శర్వానంద్ మూవీ థియేటర్స్ లో లాభాలు పంచింది లేదు.

    అటు కృతి శెట్టి పరిస్థితి కూడా అలానే ఉంది. ఆరంభంలో వరుస హిట్స్ ఇచ్చిన ఈ యంగ్ బ్యూటీకి కాలం కలిసి రావడం లేదు. 2022 సంక్రాంతి రిలీజ్ బంగార్రాజు అనంతరం ఆమెకు హిట్ లేదు. నాగ చైతన్యకు జంటగా నటించిన కస్టడీ డిజాస్టర్ అయ్యింది. తెలుగులో కృతి శెట్టి కెరీర్ ముగిసిన సూచనలు కనిపిస్తున్నాయి.