Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చిత్రం లో కమల్ హాసన్..సెప్టెంబర్ 2న ఫ్యాన్స్ కి పండగే!

సెప్టెంబర్ 2 న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన సరికొత్త కాన్సెప్ట్ పోస్టర్ ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. అంతే కాదు, ఈ చిత్రం లో ప్రముఖ సూపర్ స్టార్ కమల్ హాసన్ కూడా భాగం కాబోతున్నాడని ఫిలిం నగర్ లో లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్.

Written By: Vicky, Updated On : August 10, 2024 5:31 pm

Pawan Kalyan(2)

Follow us on

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఊపిరి తీసుకోలేనంత బిజీ గా గడుపుతున్నాడు అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కాబట్టి. ప్రతీ రోజు ఆయన ప్రభుత్వ కార్యకలాపాలతో ఎంత బిజీ గా గడుపుతున్నాడో మన కళ్లారా మీడియా లో చూస్తూనే ఉన్నాం. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అనుభవిస్తున్న హోదా పట్ల అభిమానులు ఎంతో సంతోషంగా ఉన్నారు. కానీ అభిమానుల్లో ఒక చిన్నపాటి భయం ఉంది. ఇంత సీరియస్ గా పవన్ కళ్యాణ్ తన విధి నిర్వహణ బాధ్యతలను చేపడుతున్నాడు, ఇలాంటి సమయం లో ఆయన సినిమాలు మానేస్తాడేమో అనే బెంగ అభిమానుల్లో ఉంది.

అయితే పవన్ కళ్యాణ్ మళ్ళీ అక్టోబర్ నెల నుండి యాక్టీవ్ గా సినిమా షూటింగ్స్ లో పాల్గొనబోతున్నాడు అనే వార్త రావడంతో అభిమానులు ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ మరియు హరి హర వీరమల్లు వంటి చిత్రాలు ఉన్నాయి. ఈ సినిమాలన్నీ కూడా 50 శాతం కి పైగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్నాయి. వాటిల్లో ఓజీ, హరి హర వీరమల్లు చిత్రాలకు పవన్ కళ్యాణ్ కేవలం చెరో 20 రోజుల డేట్స్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి మాత్రం మూడు నెలల సమయం ఇవ్వాల్సి ఉంటుంది. వీటిల్లో ముందు ఆయన ఓజీ, హరి హర వీరమల్లు చిత్రాలను పూర్తి చేసేందుకు సుముఖత చూపిస్తున్నాడు. ఇది కాసేపు పక్కన పెడితే పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో గతం లో ఒక చిత్రాన్ని ప్రకటించారు. కాన్సెప్ట్ పోస్టర్ ని కూడా అప్పట్లో విడుదల చేసారు. కానీ పవన్ కళ్యాణ్ ఉన్న కమిట్మెంట్స్ కారణంగా ఈ సినిమా ఇప్పటి వరకు కార్య రూపం దాల్చలేదు. రీసెంట్ గానే ఈ చిత్ర నిర్మాత మాట్లాడుతూ స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి అయ్యిందని, పవన్ కళ్యాణ్ ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు షూటింగ్ ప్రారంభిస్తామని చెప్పుకొచ్చాడు.

సెప్టెంబర్ 2 న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన సరికొత్త కాన్సెప్ట్ పోస్టర్ ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. అంతే కాదు, ఈ చిత్రం లో ప్రముఖ సూపర్ స్టార్ కమల్ హాసన్ కూడా భాగం కాబోతున్నాడని ఫిలిం నగర్ లో లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. సినిమాలో ఒక పవర్ ఫుల్ పాత్ర ఉందని, అలాంటి పాత్రలకు కేవలం కమల్ హాసన్ మాత్రమే న్యాయం చేయగలడని, ఆయన్ని నిర్మాతలు సంప్రదించగా, నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. కమల్ హాసన్ ఈమధ్యనే ప్రభాస్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ కల్కి లో విలన్ రోల్ చేసాడు. ఈ చిత్రం లో ఆయన కనిపించింది చాలా తక్కువ అయ్యినప్పటికీ, ఆ సన్నివేశాలు ఎంతో పవర్ ఫుల్ గా అనిపించాయి. అలాంటి పవర్ ఫుల్ పాత్రలు చెయ్యడానికి కమల్ హాసన్ ఇక నుండి సిద్దమేనట. దీంతో ఆయనతో కాంబినేషన్స్ మన స్టార్ హీరోలతో భవిష్యత్తులో ఎన్నో చూడొచ్చు అన్నమాట.