Homeఎంటర్టైన్మెంట్‘షణ్ముఖ్-బిగ్ బాస్ బ్యూటీ దీప్తి సునయన ప్రేమలో ‘మలుపు’

‘షణ్ముఖ్-బిగ్ బాస్ బ్యూటీ దీప్తి సునయన ప్రేమలో ‘మలుపు’

దీప్తి సునయన. ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందుకు గల ముఖ్య కారణం సోషల్ మీడియా. సోషల్ మీడియాలో మంచి స్టార్ గా ఉన్న ఆమె, బిగ్ బాస్ 2 సీజన్ లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

Shannu Deepthi Sunaina Malupu Cover Song Female Version

అంతేకాకుండా ఒక మంచి సెలబ్రిటిగా పేరు తెచ్చుకొని యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ ఎప్పటికప్పుడు తన కంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది దీప్తి సునయన. బిగ్ బాస్ 2 లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తనీష్ తో నడిపిన ప్రేమాయణం కూడా అప్పట్లో ఒక సెన్సేషన్ గా మారింది. అనంతరం దీప్తి, తనీష్ బయటకు వచ్చిన తర్వాత ఎవరి దారి వారు చూసుకున్నారు.

ఇది ఇలా ఉండగా….ఇప్పటికే దీప్తి బాయ్ ఫ్రెండ్ షణ్ముఖ్ అని అందరికీ తెలిసిన విషయమే.ఇక షణ్ముఖ్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతను కూడా ఒక సెన్సేషన్ స్టార్ గా ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుని మంచి ఫాలోయింగ్ తో ఒక స్టార్ లాగా ఎదిగిపోయాడు. అలాగే ఎప్పటికప్పుడు షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ యువతను బాగా అక్కట్టుకున్నాడు.

ఇక బిగ్ బాస్ హౌస్ లో నుండి బయటికి వచ్చిన తర్వాత వీరిద్దరి మధ్య గొడవలు వచ్చి దీప్తి, షణ్ముఖ్ విడిపోయారు.ఇది ఇలా ఉండగా…. స్టార్ మా లో 100% లవ్ అంటూ ఒక ప్రోగ్రాం మొదలైపోయింది. ఈ ప్రోగ్రాం లో భాగంగా చాలా రోజుల తర్వాత దీప్తి, షణ్ముఖ్ మళ్ళీ ప్రేక్షకుల ముందుకు కనబడ్డారు.ఈ షోలో దీప్తి, షణ్ముఖ్ ప్రేమను ఓపెన్ గా అందరికీ తెలియజేశారు. అంతేకాకుండా ఒకరినొకరు ప్రేమించుకున్నారు ప్రేక్షకులకు తెలిపారు.

ఆ తర్వాత అతిపెద్ద రియాలిటీ షో అయిన బిగ్ బాస్ లో షణ్ముఖ్ కి అవకాశం వచ్చింది. ఇప్పుడు ఇంకా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. సెప్టెంబర్ 16న షణ్ముఖ్ బర్త్ డే స్పెషల్ గా దీప్తి సునయన “మలుపు” మేల్ వెర్షన్ రిలీజ్ చేయగా, పెద్ద సెన్సేషన్ సృష్టించింది. తాజా గా దీప్తి సునయన కూడా ఫిమేల్ వెర్షన్ మలుపు సాంగ్ ని రిలీజ్ చేసి తనదైన ముద్ర వేసింది.

Malupu female Version 4k | Deepthi Sunaina | Shanmukh Jaswanth | Vinay shanmukh | Infinitum

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version