Prakash Raj: విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్. తెలుగు సినిమాకు దొరికిన ఆణిముత్యం. తన వైవిధ్యమైన నటనతో ఎన్నో అవార్డులు గెలుచుకుని తనేంటో నిరూపించుకున్నాడు. తన కన్నా వయసులో పెద్ద వారికైనా చిన్న వారికైనా తండ్రి పాత్రలో జీవిస్తూ చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. పలు చిత్రాల్లో తన సహజ నటనతో ఎందరికో స్ఫూర్తి నింపిన సంగతి తెలుసు.
Also Read: హీరో కావాల్సిన వ్యక్తి మోహన్ బాబు వల్ల బస్సు ట్రావెల్స్ నడిపి కోటీశ్వరుడయ్యాడు.. ఎవరంటే?
పలు సినిమాల్లో తన కంటే పెద్ద వారికి సైతం తండ్రిగా నటించి తన నటనకు ప్రాణం పోశాడు. అంత:పురం చిత్రంలో సాయికుమార్ కు తండ్రిగా నటించాడు. సాయికుమార్ కంటే ప్రకాశ్ రాజ్(Prakash Raj) వయసు తక్కువే. కానీ ఆ సినిమా ఎంతటి ఘన విజయం సాధిందో చూశాం. ఇక సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో కూడా వెంకటశ్ కు తండ్రిగా చేశారు. వెంకటేశ్ వయసు కూడా ఎక్కువే.
ఇలా వయసు తేడాతో చూడకుండా తన నటనకే ప్రాధాన్యం ఇస్తూ సినిమాల్లో ప్రకాశ్ రాజ్ వైవిధ్యానికి పెద్దపీట వేశారు. దీంతో పాటు రాజకీయాల్లో కూడా ప్రకాశ్ రాజ్ తనదైన ముద్ర వేస్తూ సాగిపోతున్నారు. ఇటీవల మా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కానీ సినిమాల విషయంలో మాత్రం ఎంతో శ్రద్ధ తీసుకుంటూ తన మనుగడ కొనసాగిస్తున్నారు.
అయితే ప్రకాశ్ రాజ్ పై ఓ రూమర్ ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఆయన షూటింగ్ కు సమయానికి రారని నిర్మాతలను వేధిస్తారని ఓ వాదన ఉంది. కానీ ఆయన నటనకు అందరు ఫిదా అయిపోయి తమ సినిమాల్లో ప్రకాశ్ రాజ్ ఉండాలని కోరుకుని తీసుకుంటారు. దీంతో ఆయన తెలుగు సినిమాలో బాగా పాపులర్ అయిన నటుడిగా గుర్తింపు పొందడం గమనార్హం.
Also Read: యూట్యూబ్ లో దుమ్మురేపుతున్న “ఆలీతో జాలీగా” లో బ్రహ్మానందం ప్రోమో… ఏం అన్నారంటే ?