Director Shankar: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో సత్తా చాటుకున్న దర్శకుడు శంకర్… ఒకప్పుడు ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ లభించేది. కానీ ఇప్పుడు ఆ రోజులు పోయాయి. వరుస సినిమాలతో ప్రేక్షకులను ఇబ్బంది పెట్టిన ఆయనకి స్టార్ హీరోలు సైతం డేట్స్ ఇవ్వడం లేదు. మరి తను అంతలా విఫలం అవ్వడానికి గల కారణం ఏంటంటే ఆయన రాసుకునే కథల్లో క్లారిటీ మిస్ అవుతుంది. ఐ సినిమా నుంచి అదే తంతు మొదలైంది.
వరుస సినిమాలతో ప్రేక్షకుడిని మైమరపింప చేయాలనే ప్రయత్నం చేసిన కూడా కథల విషయంలో లోపాలు ఉండడం వల్ల ఆయన అనుకున్న రేంజ్ లో సినిమాని చేయలేకపోతున్నాడు. దర్శకుడిగా తను చాలా వరకు సక్సెస్ అయినప్పటికి కథల విషయంలో మాత్రం ఆయన చాలా వరకు తడబడుతున్నాడు. ఒక మంచి రైటర్ ని పెట్టుకొని మంచి కథలు రాయించుకుంటే బాగుంటుంది.
అలా కాకుండా ఇష్టం వచ్చిన కథను సినిమాలుగా చేస్తూ ప్రేక్షకులను ఇబ్బంది పెడితే తన మార్కెట్ ను కోల్పోవడమే కాకుండా ప్రేక్షకులు సైతం ఆయన సినిమాను చూడడానికి పెద్దగా ఆసక్తిని ఐతే చూపించరు… ఇప్పుడు ఆయన ఏ సినిమా చేస్తున్నాడు అనే విషయం మీద సరైన క్లారిటి లేదు. కానీ మొత్తానికైతే ఆయన ఏ సినిమా చేసిన కూడా తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన సమయమైతే ఆసన్నమైంది.
ఒకప్పుడు ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ గా కొనసాగిన ఆయన ఇప్పుడు ఒక్క సక్సెస్ ను సాధించడానికి కూడా అంతలా ఇబ్బంది పడుతున్నాడు అంటే ఆయన తన ఫామ్ ను ఏ రేంజ్ లో కోల్పోయాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడప్పుడే తను తిరిగి తన ఫామ్ ని సంపాదించుకోవడం అనేది అసాధ్యమనే చెప్పాలి. ఒకవేళ సంపాదించినా కూడా ఆయన ఆ రేంజ్ సక్సెస్ ని సాధిస్తాడా? లేదంటే నార్మల్ విజయాలతోనే ప్రేక్షకులను అలరిస్తాడా అనేది కూడా తెలియాల్సి ఉంది…