Homeఎంటర్టైన్మెంట్Minister Roja- Dasara Vaibhavam Event: సన్మానం అంటూ పిలిచి రోజాకు అవమానం..!

Minister Roja- Dasara Vaibhavam Event: సన్మానం అంటూ పిలిచి రోజాకు అవమానం..!

Minister Roja- Dasara Vaibhavam Event:మంత్రి పదవి వచ్చాక రోజా బుల్లితెరకు దూరమయ్యారు. ఇక నా జీవితం ప్రజాసేవకే అంకితమంటూ జబర్దస్త్ షోతో పాటు బుల్లితెర ఈవెంట్స్ కి స్వస్తి పలికారు. దాదాపు 9 ఏళ్ళు రోజా జబర్దస్త్ జడ్జిగా వ్యవహరించారు. 2019 లో నాగబాబు వెళ్ళిపోయినా రోజా మాత్రం జబర్దస్త్ లో తన మార్క్ చూపించారు. నిబంధనల రీత్యా మంత్రి పదవిలో ఉన్న ప్రజా ప్రతినిధులు వేరే ఆదాయమార్గాల్లో కొనసాగకూడదు. దీంతో రోజా బుల్లితెర ఈవెంట్స్ మానేశారు. అయితే రోజా రీఎంట్రీ ఇచ్చారు. దసరా కోసం మల్లెమాల దసరా వైభవ్ పేరుతో స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ కి గెస్ట్ గా రోజా హాజరయ్యారు.

Minister Roja- Dasara Vaibhavam Event
Minister Roja

వస్తూ వస్తూనే ఈవెంట్ లో ఉన్న యాంకర్స్, కమెడియన్స్ పై రోజా పంచ్లు విసిరారు. శ్రీముఖికి టూరిజం మినిస్టర్ పదవి ఇవ్వాలి, ఎందుకంటే ఆమె అన్ని ఛానల్స్ కి టూర్స్ కొడుతుందని కామెంట్ చేసింది. అలాగే హైపర్ ఆది మీద కూడా ఆమె పంచ్ వేశారు. ఇక చాలా కాలం తర్వాత కమ్ బ్యాక్ ఇచ్చిన రోజాకు కమెడియన్స్ సన్మానం చేశారు. సన్మానం జరుగుతుండగా రోజాపై కమెడియన్ నూకరాజు ఏదో జోక్ వేశాడు. ఆ జోక్ కి రోజా హార్ట్ అయ్యారు. సన్మానం అని పిలిచి ఇలా అవమానిస్తారా అంటూ అసహనం వ్యక్తం చేశారు.

Also Read: Bigg Boss Season 6 TRP Ratings: పడిపోయిన బిగ్ బాస్ రేటింగ్.. సీరియల్స్ కన్నా దారుణం.. ఎంతో తెలుసా?

దసరా స్పెషల్ ఈవెంట్ ప్రోమో విడుదల కాగా… అందులో ఈ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. దసరా వైభవం ఈవెంట్ లో నిజంగా ఏం జరిగిందో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారం కావాలి. మల్లెమాలను వీడిపోయినవారు మెల్లగా ఒక్కొక్కరిగా తిరిగి వస్తున్నారు. జబర్దస్త్ వీడిన గెటప్ శ్రీను, హైపర్ ఆది మరలా ఆ షోలో కనిపిస్తున్నారు. సుడిగాలి సుధీర్ సైతం తిరిగి వచ్చే సూచనలు కలవు. రోజా మంత్రిగా ఉన్న నేపథ్యంలో ఆమె మరలా జబర్దస్త్ లో కనిపించడం అసాధ్యమే.

Minister Roja- Dasara Vaibhavam Event
Minister Roja

మరోవైపు రోజా కూతురు అన్షు మాలిక హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. టీనేజ్ లో ఉన్న అన్షు హీరోయిన్ కావడం ఖాయమంటున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు రోజా చేస్తున్నారట. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా ప్రచారం అవుతుంది. రోజా భర్త సెల్వమణి తమిళ దర్శక నిర్మాత కావడం విశేషం. 90 లలో హీరోయిన్ గా రోజా సౌత్ భాషల్లో వందకు పైగా చిత్రాలలో నటించారు. రోజా వారసురాలిగా అన్షు మాలిక వెండితెరను ఏలడం ఖాయమంటున్నారు.

Also Read:Adipurush Teaser: అయోధ్య వేదికగా ఆదిపురుష్ టీజర్ లాంచ్… వందల కోట్లు కొల్లగొట్టేందుకు ప్రభాస్ మాస్టర్ ప్లాన్!

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
RELATED ARTICLES

Most Popular