Petrol Pumps In Space: సాంకేతకత పెరుగుతోంది. ఆధునిక టెక్నాలజీతో నూతన ఆవిష్కరణలు జరుగుతున్నాయి. దీంతో మనిషి తన గమనంలో ఎన్నో మలుపులు తిరుగుతున్నాయి. అంతరిక్షంలో జరిగే మార్పులకు కూడా ఎన్నో కొత్త విషయాలు కనుగొంటున్నారు. మనం పంపే రాకెట్లలో ఇంధనం అయిపోతే ఏంటనే ప్రశ్నలు భవిష్యత్ లో రావని తెలుస్తోంది. ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. గ్రహశకలాలు భూమిపై జీవాన్ని ప్రభావితం చేస్తాయి. రాబోయే రోజుల్లో కూడా వీటి ప్రభావం మనకు ఉంటోంది. మానవాళి మనుగడ ఖగోళశాస్త్రానికి ఆధారంగా మారుతోంది. ఈ నేపథ్యంలో సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది.

కొన్ని కోట్ల సంవత్సరాలు గ్రహశకలాలు భూమిని ఢీకొనడం వల్లే రాక్షస బల్లులు అంతరించాయని చరిత్ర చెబుతోంది. దీన్ని శాస్త్ర సాంకేతికత కూడా ఒప్పుకుంటోంది. గ్రహ శకలాలు భూమిని ఢీకొనడం ఇప్పటిది కాదు. ఏనాటి నుంచో ఆ ఆనవాళ్లు మనకు కనిపిస్తున్నాయి. వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడంతో వందేళ్లకోసారి జరిగే తీరును గమనిస్తే మనకు అర్థం అవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో భూ కక్ష్యలో కొత్తగా వ్యర్థాలు పోగుపడకకుండా చూసుకోవాలి. ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టాక వృథాగా మిగిలిపోయే రాకెట్ భాగాలు అక్కడే ఉండిపోతాయి. తర్వాత అవి పేలిపోతే భారీగా శకలాలు ఉత్పన్నమవుతాయి.
Also Read: Janasena Chief Pawan Kalyan: ఆ ముగ్గురు నేతల కోసం పవన్ కల్యాణ్ భారీఫైట్‌కు రెడీ?
ఉపగ్రహాలు పనిచేసే స్థితిలోనే ఉన్నప్పటికి వాటిలో ఇంధనం ఖాళీ కావడం వల్ల పనికిరాకుండా పోతున్నాయి. ఇంధనం లేకపోవడంతో అవి స్థిరంగా కక్ష్యలో ఉండకపోవడంతో భూ గురుత్వాకర్షణ శక్తి సమానంగా ఉండదు. దీంతో ఉపగ్రహ కక్ష్యలోనూ మార్పులు చోటుచేసుకుంటాయి. దీంతో ఉపగ్రహాలను వదిలేయడమే మంచిది. ఈ పరిస్థితిని అధిగమించడానికి రాబోయే కాలంలో కొత్త టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏటా వెయ్యికి పైగా ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నారు. దీంతో ఎంతో డబ్బు ఖర్చు పెట్టి కొత్త ఉపగ్రహాలను నిర్మించడం కన్నా పాత వాటిలోనే ఇంధనం నింపితే సమయం ఆదా అవుతుందని భావిస్తున్నారు. రోదసిలోనే పెట్రోల్ పంపులు ఏర్పాటు చేసే దిశగా ఆలోచిస్తున్నారు. ఇది కార్యరూపం దాల్చితే ఎంతో అభివృద్ధి జరుగుతుందని చెబుతున్నారు.

పాత ఉపగ్రహాల వద్దకు వెళ్లి ఇంధనం నింపే వ్యోమనౌకలు వస్తున్నాయి. దీంతో ఇవి ఆయిల్ ట్యాంకర్లుగా పనిచేస్తాయనడంలో సందేహం లేదు. రోదసిలోనే ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నాు. గ్రహ శకలాల్లో ఇంధనం వ్యోమనౌకల ద్వారా ఈ కేంద్రాలకు తరలిస్తారు. అక్కడ నుంచి ఎంఈవీ సాయంతో ఉపగ్రహాలకు చేరవేయవచ్చు. ఈ వ్యవస్థ సాకారమైతే భూమి నుంచి ఇంధనాన్ని తరలించాల్సిన అవసరం ఉండదు. అంతిమంగా ఇలాంటి ప్రయత్నాల ద్వారా అంతరిక్ష వ్యర్థాలను తగ్గించే అవకాశం ఉంది.
వందేళ్లలో భూమిని ఢీకొట్టే అవకాశమున్న గ్రహశకలాలను గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో గ్రహశకలాలు ఢీకొంటే పరిస్థితులు ఎలా ఉంటాయనే దానిపై పరిశోధనలు జరుగుతున్నాయి. అంతరిక్షంలో జరిగే పరిణామాల నేపథ్యంలో వాటిని మార్చేందుకు పలు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గ్రహశకలాలను ఢీకొనే తీరును అడ్డుకునేందుకు పలు రకాలుగా పరిశోధనలు చేసి వాటిని విజయవంతం చేయాలని భావిస్తున్నారు.
Also Read:Bigg Boss Season 6 TRP Ratings: పడిపోయిన బిగ్ బాస్ రేటింగ్.. సీరియల్స్ కన్నా దారుణం.. ఎంతో తెలుసా?