Shambhala Vs Champion: సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల హవా ఎక్కువగా కొనసాగుతుంది. వాళ్లకి ఎక్కువ సంఖ్యలో అభిమానులు ఉంటారు కాబట్టి వాళ్ళ సినిమాలు ఆదరించడానికి ప్రేక్షకులు ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఈ సంవత్సరం ఇప్పటికే లిటిల్ హార్ట్స్,ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో, రాజు వెడ్స్ రాంబాయి లాంటి చిన్న సినిమాలు సక్సెస్ ఫుల్ టాక్ ను సంపాదించుకున్నాయి. ఇక ఈ సంవత్సరం చివరి వారం కావడం వల్ల ఈరోజు నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి…ఆ సినిమాలు ఎలా ఉన్నాయి సగటు ప్రేక్షకులను మెప్పించాయా లేదా ఆ నాలుగింటిలో ఏ సినిమా విజయాన్ని సాధించింది అనేది మనం ఒకసారి తెలుసుకుందాం…
శంభాల
ఆది సాయికుమార్ హీరోగా వచ్చిన ఈ మూవీ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. కథను అద్భుతంగా రాసుకున్న దర్శకుడు దానిని స్క్రీన్ మీద ఎగ్జిక్యూట్ చేయడంలో కొంతవరకు తడబడ్డప్పటికి సినిమా ఒక టెంపోలో ముందుకు సాగుతోంది. కాబట్టి ప్రేక్షకులు ఆ సినిమాకు కనెక్ట్ అయి చూస్తూ కూర్చుండిపోయారు. దానివల్ల సినిమా సక్సెస్ తీరాలకైతే చేరిందనే చెప్పాలి… మొత్తానికైతే ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది.
ఛాంపియన్
శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. ప్రముఖ ప్రొడ్యూసర్ అయిన అశ్వినీదత్ కూతురు స్వప్న దత్ ఈ సినిమాని చాలా గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ సినిమా ఫస్ట్ షో తోనే యావరేజ్ టాక్ ను సంపాదించుకోవడంతో సినిమాని చూడడానికి కొంతమంది ఆసక్తి చూపించడం లేదు. సినిమాలో పెద్దగా మ్యాటర్ లేదనే వార్త బయట ఎక్కువగా వినిపిస్తోంది. కాబట్టి ప్రతి ఒక్కరు సినిమా చూడాలా? వద్దా అనే డైలమాలో పడిపోయారు…
దండోర
నవదీప్,శివాజీ, బిందు మాధవి, నందు కలిసి చేసిన దండోర సినిమా విలేజ్ బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కింది. ఈ మధ్యకాలంలో వచ్చిన విలేజ్ సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఇక ఈ సినిమా కూడా ఒక ఇంటెన్స్ డ్రామా తో ప్రేక్షకుడిని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. మొత్తానికైతే ఈ సినిమాకి యావరేజ్ మార్కులు పడ్డాయి…
ఈషా
రాజు వెడ్స్ రాంబాయి సినిమాలో హీరోగా నటించిన అఖిల్ రాజ్, హెబ్బా పటేల్, సిరి హనుమంతు ప్రధాన పాత్రలను పోషించిన ఈ సినిమా సైతం ఈరోజు రిలీజ్ అయింది…ఈ సినిమా హార్రర్ సన్నివేశాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికి ఈ సినిమాలో అసలు హార్రర్ సన్నివేశాలు లేకపోవడంతో ప్రేక్షకుడు ఈ సినిమాలకు పెద్దగా కనెక్ట్ కాలేకపోయారు. మొదటి రోజే ఈ సినిమాకు నెగెటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఇక రాబోయే రోజుల్లో ఈ సినిమా కలెక్షన్స్ భారీగా డౌన్ అయిపోయే అవకాశాలైతే ఉన్నాయి…
సినిమాల్లో ఆది సాయికుమార్ నటించిన శంభాల సినిమా ఏబో యావరేజ్ టాక్ ను సంపాదించుకొని సక్సెస్ సాధించే దిశగా ముందుకు సాగుతోంది…