Nagarjuna: సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవ్వరికి సాధ్యం కానీ రీతిలో గొప్ప సినిమాలను చేసిన హీరోలు చాలామంది ఉన్నారు. ఇక అందులో నాగార్జున ఒకరు. ఆయన చేసిన సినిమాలు ఆయన్ని స్టార్ హీరో గా నిలబెట్టడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసి పెట్టాయి… ఆయన కెరియర్ స్టార్టింగ్ లో విభిన్న తరహా సినిమాలను చేయడానికి ఆసక్తి చూపించాడు. ప్రస్తుతం మాస్ సినిమాలను ఎక్కువగా చూస్తున్న ఆయన ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ మధ్యకాలంలో ఆయన వరుసగా ఫ్లాప్ సినిమాలు చేస్తున్నాడు. ఎప్పుడు డిఫరెంట్ సినిమాలను ట్రై చేసే ఆయన తన తోటి హీరోలతో పోటీ పడలేకపోతున్నాడు.
ఏది ఏమైనా కూడా తనను తాను మరోసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలంటే మాత్రం తన 100 వ సినిమాతో భారీ కంబ్యాక్ ఇవ్వాల్సిన అవసరమైతే ఉంది. సినిమాలు ఏ విధంగా ఉన్నా కూడా ఎప్పుడు చేస్తున్న ఈ సినిమా విషయంలో మాత్రం ఆయన చాలా కేర్ ఫుల్ గా వ్యవహరించాలి. లేకపోతే మాత్రం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు…
నాగార్జున కెరియర్ లో చేసిన రెండు భారీ డిజాస్టర్లు గా మారాయి. రెండు సినిమాల్లో రక్షకుడు ఒకటి కాగా, మరొకటి భాయ్ సినిమా కావడం విశేషం… ఈ రెండు సినిమాలు అతని ఇమేజ్ ను చాలా వరకు డౌన్ చేశాయి. వీరభద్రం చౌదరి దర్శకత్వంలో చేసిన భాయ్ సినిమా నాగార్జున ఇమేజ్ ను అమాంతం డౌన్ ఫాల్ చేసిందనే చెప్పాలి.
ఆయన ఈ రెండు సినిమాలు చేసినందుకు చాలా వరకు డీలా పడ్డాడనే చెప్పాలి. ఈ విషయాన్ని నాగార్జున గతంలో చాలా సందర్భాల్లో తెలియజేశాడు. ఇక రక్షకుడు సైతం పాన్ ఇండియా సినిమాగా వచ్చి ఘోరమైన డిజాస్టర్ ని మూటగట్టుకుంది. ఈ సినిమాలో సాంగ్స్ బాగుంటాయి. ఇంకా సినిమా మాత్రం ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో లేకపోవడంతో డిజాస్టర్ గా మారింది…