తమిళంలో చేసిన సినిమాలు షాలిని పాండేకు వర్కౌట్ కాకపోవడంతో తిరిగి టాలీవుడ్ బాటపట్టింది. తాజాగా రాజ్ తరుణ్ కు జోడీగా నటించింది. ఈ సినిమాకూడా ప్లాప్ అవడంతో అమ్మడికి అవకాశాలు తగ్గాయి. అయితే ఉన్నట్టుండి షాలిని పాండేకు హిందీలో ఛాన్స్ దక్కించుకుంది. రణవీర్ సింగ్ కు జోడీగా ‘జయేష్ భాయ్ జోర్దార్’ చిత్రంలో షాలిని పాండే నటిస్తోంది. అయితే తనకు సహజమైన పాత్రలో నటించాలని ఉందని చెబుతుంది.
కొంతమంది దర్శకులు హీరోయిన్ అంటే గ్లామర్ మాత్రమే చూస్తారని షాలిని పాండే అంటుంది. తాను హీరోయిన్ ను ఓ వస్తువులా చూపించే ఏ చిత్రాన్నీ అంగీకరించనంటూ స్పష్టం చేస్తుంది. అలాగే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలోనూ నటించాలని తన మనసులోని మాటను వెల్లడించింది. అసలే అవకాశాలు అంతమాత్రంగా ఉన్న తరుణంలో గ్లామర్ పాత్రలు కాకుండా నటనపరమైన పాత్రలే చేస్తానని షాలిని చెబుతుండటంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. షాలిని ఇప్పటికైనా మడికట్టుకొని కూర్చోకుండా దర్శకులు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తోటి హీరోయిన్లు సూచిస్తున్నారట. ఈ గ్లామర్ హీరోయిన్ వారి మాట వింటుందో లేదో చూడాలి మరీ..