https://oktelugu.com/

ట్రైలర్ తో ఆకట్టుకుంటున్న శృంగార తార ‘షకీలా’ !

ఒకప్పటి హాట్ బాంబ్ షకీలా జీవితమే ఓ సంచలనం.. ఎన్నో చీకటి రాత్రులు, మరెన్నో మోసాలు, అన్నటికీ మించి కన్నీటి సంఘటనలు.. ఇలా ఆమె జీవితమే ఓ పెద్ద సంఘర్షణ మయం. అందుకే, ఆమె జీవిత చరిత్రని సినిమాగా తీసాడు కన్నడ దర్శకుడు ఇంద్రజిత్ లంకేశ్. కాగా తాజాగా ‘షకీలా’ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రబృందం. ట్రైలర్ ను చూస్తుంటే షకీలా పాత్రలో రిచా చద్దా రెచ్చిపోయి నటించింది. జీవితకాలంలో షకీలా చూపించిన అందచందాలు రిచా […]

Written By:
  • admin
  • , Updated On : December 26, 2020 / 05:15 PM IST
    Follow us on


    ఒకప్పటి హాట్ బాంబ్ షకీలా జీవితమే ఓ సంచలనం.. ఎన్నో చీకటి రాత్రులు, మరెన్నో మోసాలు, అన్నటికీ మించి కన్నీటి సంఘటనలు.. ఇలా ఆమె జీవితమే ఓ పెద్ద సంఘర్షణ మయం. అందుకే, ఆమె జీవిత చరిత్రని సినిమాగా తీసాడు కన్నడ దర్శకుడు ఇంద్రజిత్ లంకేశ్. కాగా తాజాగా ‘షకీలా’ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రబృందం. ట్రైలర్ ను చూస్తుంటే షకీలా పాత్రలో రిచా చద్దా రెచ్చిపోయి నటించింది. జీవితకాలంలో షకీలా చూపించిన అందచందాలు రిచా రెండు గంటల్లోనే చూపించి కుర్రకారుకు మత్తు ఎక్కించేలా ఉంది. పైగా నటన పరంగా కూడా ఆమె అద్భుతంగా నటించడమే కాకుండా ఓ రేంజ్ లో ఎమోషన్ని పలికించింది.

    Also Read: క్రేజీ బ్యూటీ ‘రష్మిక’ క్రేజీ ప్లానింగ్ !

    అలాగే ఈ ట్రైలర్ లో షకీలా అసలు సినిమాలలోకి ఎలా వచ్చింది.. తన బోల్డ్ సినిమాలతో ఎలాంటి అనుభవాలను ఎదుర్కొంది.. జూనియర్ సిల్క్ గా ఎలా పేరు తెచ్చుకుంది.. చివరకు అయినవాళ్ల చేతలోనే ఎలా మోసపోయింది. ఇలా షకీలా సక్సెస్ మరియు ఫెయిల్యూర్స్.. అనే అంశాలు ట్రైలర్ లో ప్రస్తావించారు. పంకజ్ త్రిపాఠి అలనాటి సౌత్ స్టార్ హీరో పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించాడు. ఇప్పటికే హిందీలో విడుదలైన ‘షకీలా’ సినిమా కోసం తెలుగు తమిళ కన్నడ మలయాళ ప్రేక్షులు ఆతృతగా ఎదురుచూస్తున్నారని మేకర్స్ చెబుతున్నారు. మరి సినిమా రిలీజ్ అయితే గానీ, అసలు విషయం తెలియదు.

    Also Read: డే 1 సాలిడ్ వసూళ్లు రాబట్టిన “సోలో బ్రతుకే సో బెటర్”.!

    అయితే ఇంకా ఈ సినిమాకి బిజినెస్ కూడా జరగలేదు. అప్పులు చేసి మరి మేకర్స్ ఈ సినిమాని చేశారు. మరి కలెక్షన్స్ ఏ రేంజ్ లో వస్తాయో చూడాలి. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ లో పుట్టి పెరిగిన షకీలా 1990లలో శృంగార చిత్రాల క్వీన్ గా వెలుగొంది.. ఆ రోజుల్లో ఒక సంచలనం సృష్టించింది. ముఖ్యంగా మలయాళ చిత్రసీమని ఓ ఊపు ఊపేసింది. అప్పట్లో ఓ రేంజులో ఆమె హవా నడిచినా చివరకు ఆమె జీవితం చాల కష్టాల్లో ఉండటం నిజంగా బాధాకరమైన విషయమే.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్