
ఏపీలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 282 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 442 మంది కోలుకున్నారు. ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఇప్పటివరకు 8,80,712 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 8,69,920 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో 3,700 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. 7,092 మంది ప్రాణాలు కోల్పోయారని వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం నివేదికలో వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 42,911 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు 1,15,74,117 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. న్నారు.