Shakalaka Shankar: జబర్దస్త్ షో ద్వారా కమెడియన్గా తెలుగు తెరకు పరిచయమయ్యాడు షకలక శంకర్. తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందాడు శంకర్. ఇక శంకర్ ప్రస్తుతం హీరోగా మారి పలు చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నాడు. శంకర్ హీరోగా రానున్న లేటెస్ట్ మూవీ ధర్మస్థలి. ఈ చిత్రాన్ని రొచిశ్రీ మూవీస్ బ్యానర్ లో ప్రముఖ నిర్మాత ఎం ఆర్ రావు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి రమణ మోగిలి దర్శకత్వం వహిస్తున్నారు. పక్కా మాస్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ చిత్రంలో పావని హీరోయిన్ గా నటిస్తుంది. వినోద్ యాజమాన్య ఈ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నారు. ధర్మస్థలి టైటిల్ వెనక కథ సమాజంలో జరిగే విషం లాంటి ఒక విషయాన్ని అందరికి అర్ధమయ్యేలా దర్శకుడు రమణ మోగిలి తెరకెక్కిస్తున్నారు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని జనవరిలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది ధర్మస్థలి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సందర్బంగా దర్శకుడు రమణ మోగిలి మాట్లాడుతూ… ‘షకలక శంకర్ తో ఇప్పటివరకూ ఇలాంటి చిత్రాన్ని, ఈ కాన్సెప్ట్ ని ఎవరూ తెరకెక్కించలేదు. ఆయనలో వున్న కామెడి టైమింగ్ చూసిన వారికి ఆయనలో వున్న ఇంటెన్సిటి ఈ చిత్రం ద్వారా అర్దమవుతుంది. ప్రతిరోజు మన జీవితాలతో ముడి పడిన ఓ విషయాన్ని అలాగే మన జీవితాలతో ఆడుకుంటున్న అంశాన్ని ఆయన పాత్ర ద్వారా తెలియజేస్తున్నాం. ఆయనలో వున్న కామెడి టైమింగ్ మిస్ కాకుండా ఇంటెన్సిటిని తెరపైకి తీసువస్తున్నాం. ఈ టైటిల్ ని ఎనౌన్స్ చేయగానే భారీ బడ్జెట్ చిత్రాలకి వచ్చిన రెస్పాన్స్ రావటం విశేషం అని అన్నారు.