Anant Ambani Pre Wedding: ఆర్ఆర్ఆర్ పాటకు.. ఖాన్ త్రయం నాటు స్టెప్పులు.. వీడియో వైరల్

మూడు రోజుల ముందస్తు పెళ్లి వేడుకలు ఆదివారంతో ముగుస్తాయి. సోమవారం ఉదయం వచ్చిన అతిథులు ఎవరి ప్రాంతానికి వారు వెళ్లిపోతారు. ఇందుకు సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రత్యేకంగా విమానాలు సమకూర్చింది.

Written By: Suresh, Updated On : March 3, 2024 12:35 pm
Follow us on

Anant Ambani Pre Wedding: జామ్ నగర్ వేదికగా ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ముందస్తు పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం, శనివారం డ్రోన్ షో, కాక్ టైల్, ఆదివారం దాండియా, సంగీత్ వేడుకలు జరిగాయి. పాప్ సింగర్ రిహన్నా తన పాటలతో అలరించింది. ముందస్తు పెళ్లి వేడుకలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ప్రపంచ స్థాయి వ్యాపారవేత్తలు, క్రీడాకారులు, సినీ నటులు, ఇతర సామాజికవేత్తలు ఈ మందస్తు పెళ్లి వేడుకల్లో సందడి చేస్తున్నారు.

ఇక ఈ వేడుకల్లో శనివారం బాలీవుడ్ ఖాన్ త్రయం షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రసంగం పూర్తయిన తర్వాత…షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ వేదిక మీదకు వచ్చారు. ముగ్గురూ ఒకే రకమైన దుస్తులు ధరించి సందడి చేశారు. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నాటు నాటు అనే పాటకు స్టెప్పులు వేసి వేదిక కింద ఉన్న అతిరథ మహారధులందరినీ సమ్మోహితులను చేశారు. ఈ పాటకు ముందుగా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాగా డ్యాన్స్ వేయాలని అనుకున్నారు. ఈ స్టెప్పును సల్మాన్ ఖాన్ ప్రారంభించారు. ఆ తర్వాత సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ అనుకరించారు. తర్వాత ఏమైందో తెలియదు గానీ దాని నిలిపివేసి.. వారి స్టైల్లో స్వాగ్ ప్రదర్శించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

మూడు రోజుల ముందస్తు పెళ్లి వేడుకలు ఆదివారంతో ముగుస్తాయి. సోమవారం ఉదయం వచ్చిన అతిథులు ఎవరి ప్రాంతానికి వారు వెళ్లిపోతారు. ఇందుకు సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రత్యేకంగా విమానాలు సమకూర్చింది. కాగా, ముకేశ్ అంబానీ ఈ ముందస్తు పెళ్లి వేడుకల కోసం 1000 కోట్ల దాకా ఖర్చు చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. హాలీవుడ్ పాప్ గాయని రిహన్నా ఈ వేడుకల్లో పాటలు పాడినందుకు 75 కోట్లు చార్జ్ చేసినట్టు తెలుస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి పెద్దపెద్ద వ్యక్తులు రావడంతో జామ్ నగర్ ప్రాంతం సందడిగా మారింది. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.