https://oktelugu.com/

Shah Rukh Khan: తీవ్ర నిరాశలో నెంబర్ వన్ ‘స్టార్ హీరో’.. కారణం అదే !

Shah Rukh Khan: హిందీ చిత్రాలకు ప్రస్తుతం కనీస స్థాయిలో కూడా ఓపెనింగ్స్ రావడం లేదనేది నగ్న సత్యం. బాలీవుడ్ పెద్ద హీరోల్లో ఒకరైన షాహిద్ కపూర్ నటించిన ‘జెర్సీ’ సినిమాకి మొదటి వీకెండ్ కేవలం 14 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి అంటే.. మీరు నమ్ముతారా ? నమ్మాలి ఇది నిజం. ఇప్పుడు ఇదే భయం పట్టుకుంది మిగిలిన స్టార్ హీరోలకు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ దగ్గర నుంచి అమీర్ ఖాన్ వరకూ అందరూ […]

Written By:
  • Shiva
  • , Updated On : April 28, 2022 / 05:42 PM IST
    Follow us on

    Shah Rukh Khan: హిందీ చిత్రాలకు ప్రస్తుతం కనీస స్థాయిలో కూడా ఓపెనింగ్స్ రావడం లేదనేది నగ్న సత్యం. బాలీవుడ్ పెద్ద హీరోల్లో ఒకరైన షాహిద్ కపూర్ నటించిన ‘జెర్సీ’ సినిమాకి మొదటి వీకెండ్ కేవలం 14 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి అంటే.. మీరు నమ్ముతారా ? నమ్మాలి ఇది నిజం. ఇప్పుడు ఇదే భయం పట్టుకుంది మిగిలిన స్టార్ హీరోలకు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ దగ్గర నుంచి అమీర్ ఖాన్ వరకూ అందరూ ఇదే భయంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

    Shah Rukh Khan

    మరోవైపు, ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్ 2’ వంటి దక్షిణాది చిత్రాలు హిందీ మార్కెట్ లో వందల కోట్ల వసూళ్లు చేస్తూ.. హిందీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్నాయి. దాంతో, షారుఖ్ ఖాన్ కి టెన్షన్ మొదలైంది. బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ స్థాయి, స్థానం వేరు. ఆయన సినిమాలు తొలి రోజు 40 కోట్ల వసూళ్లు అందుకుంటాయి.

    Also Read: Regina: తమిళ నిర్మాతల దెబ్బకు టాలీవుడ్ మీద పడ్డ హీరోయిన్

    ఐతే, షారుఖ్ ఖాన్ ప్రస్తుతం చేస్తున్న ‘పఠాన్’ సినిమాకి ఆ స్థాయి ఓపెనింగ్స్ వచ్చేలా కనిపించడం లేదు. అసలు గౌరవప్రదమైన కలెక్షన్స్ అయినా వస్తాయా ? రావా ? అని పెద్ద డౌట్ ఉంది. షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ ఆయన స్థాయి కమర్షియల్ మాస్ చిత్రం కాదు. ఇదొక ఎమోషనల్ మూవీ. విభిన్న చిత్రం. ఒక విధంగా క్లాస్ మూవీ అని కూడా అనుకోవచ్చు.

    సో.. ఇలాంటి సినిమాకు భారీ వసూళ్లు రావడం అంత సులువు కాదు. అందుకే, షారుఖ్ ఖాన్ బాగా టెన్షన్ పడుతున్నట్లు టాక్ నడుస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్ 2’ వంటి దక్షిణాది చిత్రాలు మొదటి రోజు హిందీ మార్కెట్ లో 50 కోట్ల వసూళ్లు అందుకున్నప్పుడు.. బాలీవుడ్ లోనే నెంబర్ వన్ హీరోగా చలామణి అవుతున్న తన సినిమా అంతకన్నా ఎక్కువ అందుకోవాలి కదా..?

    Shah Rukh Khan

    షారుఖ్ ఖాన్ కూడా ఇదే ఫీల్ అవుతున్నాడు. కానీ అందుకుంటుందనే నమ్మకం మాత్రం షారుఖ్ ఖాన్ కి కూడా కలగడం లేదు. అందుకే.. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ చాలా నిరాశలో ఉన్నాడు. పైగా బాలీవుడ్ పెద్ద సినిమాలన్నీ ఈ ఏడాది విడుదల కాబోతున్నాయి.

    కరోనాకి ముందు రిలీజ్ కావాల్సిన చిత్రాలన్నీ ఈ ఏడాది థియేటర్లలోకి వస్తున్నాయి. సో, షారుఖ్ ఖాన్ సినిమాకి భారీ పోటీ ఉంది. ఈ పోటీలో భారీ హిట్ కొట్టడం కష్టమే. అందుకే.. షారుఖ్ ఖాన్ తన సినిమా విషయంలో చాలా అసంతృప్తిగా ఉన్నాడు.

    Also Read:Kohli Dance: సమంత ‘ఊ అంటావా మావా’ పాటకు ఊగిపోయిన విరాట్ కోహ్లీ.. వైరల్ వీడియో

    Recommended Videos:

    Tags