https://oktelugu.com/

Regina: తమిళ నిర్మాతల దెబ్బకు టాలీవుడ్ మీద పడ్డ హీరోయిన్

Regina: ఫేడ్ అవుట్ దశలో ఉన్న హీరోయిన్ రెజీనాకి మళ్లీ కాలం కలిసి వచ్చేలా ఉంది. ఆచార్యలో చేసిన స్పెషల్ సాంగ్ కారణంగా అమ్మడు వార్తల్లో వైరల్ అవుతుంది. ఐతే.. రెజీనాకి తమిళంలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె పేరు చెప్తే చాలు పక్కా తమిళ పొన్ను అని చెన్నై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తారు. అవును, ఈ అందాలరాశి అచ్చ చెన్నై సుందరి. కానీ, రెజీనా మాత్రం చెన్నైలో సినిమాలు చెయ్యాలన్నా, తమిళ సినిమా ఆఫర్లన్నా […]

Written By:
  • Shiva
  • , Updated On : April 28, 2022 / 05:36 PM IST
    Follow us on

    Regina: ఫేడ్ అవుట్ దశలో ఉన్న హీరోయిన్ రెజీనాకి మళ్లీ కాలం కలిసి వచ్చేలా ఉంది. ఆచార్యలో చేసిన స్పెషల్ సాంగ్ కారణంగా అమ్మడు వార్తల్లో వైరల్ అవుతుంది. ఐతే.. రెజీనాకి తమిళంలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె పేరు చెప్తే చాలు పక్కా తమిళ పొన్ను అని చెన్నై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తారు. అవును, ఈ అందాలరాశి అచ్చ చెన్నై సుందరి.

    Regina

    కానీ, రెజీనా మాత్రం చెన్నైలో సినిమాలు చెయ్యాలన్నా, తమిళ సినిమా ఆఫర్లన్నా ఆసక్తి చూపడం లేదట. ఈ అందాల భామకి అక్కడ ఎదో సమస్య ఉంది అని తెలుస్తోంది. కొందరు నిర్మాతలతో రెజీనాకి కొన్ని ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి. అందుకే.. రెజీనా తెలుగు సినిమాల మీద ఎక్కువ ఆసక్తి చూపించాలని డిసైడ్ అయ్యింది.

    మొత్తానికి చెన్నైలో సినిమాలు చెయ్యడం కన్నా హైదరాబాద్ లో రెజీనాకి కంఫర్ట్ గా ఉంది అట. నిజమే తమిళ ఇండస్ట్రీ వర్గాల మాట ప్రకారం రెజీనా పై ఆ తమిళ నిర్మాతలు చాలా కోపంగా ఉన్నారు. రెజీనా మాత్రం వాళ్లను కలవడానికి కూడా ఇష్టపడటం లేదు. ప్రస్తుతం, తెలుగులో వరుసగా సినిమాలు ఒప్పుకుంటోంది.

    Regina Cassandra

    వీలైనంత వరకు ఇక్కడే సినిమాలు చేసే ప్రయత్నంలో ఉంది. తెలుగులో ప్రస్తుతం ఈ భామ విశ్వక్ సేన్ సరసన ఒక చిత్రం, కార్తికేయతో మరో చిత్రం చేయడానికి సన్నద్ధం అయింది. రెజీనాకి రేసింగ్ అన్నా ఇష్టం. కారు రేసింగ్ లో శిక్షణ కూడా తీసుకొంది. అది కూడా చెన్నైలోనే నేర్చుకొంది.

    కానీ, కెరీర్ ని మాత్రం తెలుగునాట చూసుకుంటోంది. నిజానికి రెజీనా మొదట్లో టీవీ ఛానెల్స్ లో యాంకర్ గా పని చేసింది. చివరకు హీరోయిన్ గా మారి అమ్మడు చిన్నాచితకా చిత్రాలతో ముందుకు పోతుంది. ఇంతకీ ఆచార్య ఆమె కెరీర్ కి ఏ స్థాయిలో ప్లస్ అవుతుందో చూడాలి.

    Recommended Videos:

    Tags