Shahrukh Khan – Mahesh : మహేష్ కు ఊహించని సమాధానం ఇచ్చిన షారుక్ ఖాన్

మహేష్ కి షారుక్ ఇచ్చిన ఎపిక్ రిప్లై వైరల్ అవుతుంది. షారుక్-మహేష్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది.

Written By: NARESH, Updated On : September 6, 2023 6:23 pm

srk-mahesh-babu

Follow us on

Shahrukh Khan – Mahesh : మరికొన్ని గంటల్లో జవాన్ మూవీ విడుదల కానుంది. తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించారు. జవాన్ మూవీ ట్రైలర్ అద్భుతంగా ఉంది. యాక్షన్ అండ్ సస్పెన్స్ అంశాలతో దుమ్మురేపింది. ట్రైలర్ విడుదల అనంతరం అంచనాలు తారాస్థాయికి చేరాయి. జవాన్ మూవీ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుబోతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. జవాన్ ఫస్ట్ డే ఫిగర్ భారీగా ఉండే సూచనలు కలవు.

ఇదిలా ఉంటే జవాన్ మూవీపై మహేష్ బాబు షారుక్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. మహేష్ బాబు… జవాన్ మూవీ యూనిట్ కి బెస్ట్ విషెస్ చెప్పారు. షారుక్ సిల్వర్ స్క్రీన్ పై అద్భుతం చేయనున్నాడన్న విశ్వాసం వ్యక్తం చేసిన మహేష్… కుటుంబంతో పాటు జవాన్ మూవీ చూడబోతున్నట్లు ట్వీట్ చేశాడు. మహేష్ ట్వీట్ కి షారుక్ ఖాన్ స్పందించారు. థాంక్యూ సో మచ్ మై ఫ్రెండ్. నాకు జవాన్ నచ్చుతుందని భావిస్తున్నాను. నువ్వు ఏ రోజు సినిమా చూడాలని అనుకుంటున్నావో చెబితే నీతో పాటు నేను కూడా సినిమా చూస్తాను. నీ కుటుంబానికి నా ప్రేమ పూర్వక అభినందనలు, అని షారుక్ ట్వీట్ చేశాడు.

మహేష్ కి షారుక్ ఇచ్చిన ఎపిక్ రిప్లై వైరల్ అవుతుంది. షారుక్-మహేష్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ముంబైలో ఒకటి రెండు సందర్భాల్లో షారుక్-మహేష్ కలవడం జరిగింది. ముంబై అల్లుడిగా మహేష్ తరచుగా అక్కడకు వెళుతూ ఉంటారు. నమ్రత శిరోద్కర్ కారణంగా మహేష్ కి బాలీవుడ్ తో పరిచయాలు ఏర్పడ్డాయి.

మహేష్ తో పాటు పలువురు టాలీవుడ్ హీరోలు జవాన్ మూవీని ప్రోమోట్ చేస్తూ ట్వీట్స్ వేస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా జవాన్ కి భారీ రెస్పాన్స్ దక్కుతుంది. బుకింగ్స్ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. జవాన్ మూవీలో షారుక్ భిన్నమైన గెటప్స్ లో కనిపిస్తున్నాడు. విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు ట్రైలర్ లో ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. షారుక్ కి జంటగా నయనతార నటించింది. దీపికా పదుకొనె స్పెషల్ రోల్ చేసింది. ప్రియమణి మరో కీలక రోల్ చేయడమైనది. అనిరుధ్ సంగీతం అందించారు.