https://oktelugu.com/

ఎక్స్ క్లూజివ్ : మెగాస్టార్ – వినాయక్ సినిమా డిటైల్స్ !

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘లూసిఫర్’ రిమేక్ గురించి సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. దర్శకుడు వినాయక్ కి సినిమా లేక మెగాస్టార్ చుట్టూ తిరుగుతున్నాడని.. అందుకే మెగాస్టార్ తానూ యంగ్ స్టార్ డైరెక్టర్ సుజీత్ తో చేస్తోన్న ‘లూసిఫర్’ సినిమాను వినాయక్ చేతిలో పెట్టారని.. ప్రస్తుతం వినాయక్ ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడని, ఇలా అనేక వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ వార్తలో ఎలాంటి […]

Written By:
  • admin
  • , Updated On : August 27, 2020 / 02:59 PM IST
    Follow us on


    మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘లూసిఫర్’ రిమేక్ గురించి సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. దర్శకుడు వినాయక్ కి సినిమా లేక మెగాస్టార్ చుట్టూ తిరుగుతున్నాడని.. అందుకే మెగాస్టార్ తానూ యంగ్ స్టార్ డైరెక్టర్ సుజీత్ తో చేస్తోన్న ‘లూసిఫర్’ సినిమాను వినాయక్ చేతిలో పెట్టారని.. ప్రస్తుతం వినాయక్ ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడని, ఇలా అనేక వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ వార్తలో ఎలాంటి వాస్తవం లేదు.

    Also Read: పెంపుడు కుక్కతో ప్రేమలో పడ్డ హీరోయిన్ !

    కాగా ఈ వార్త గురించి ఫిల్మ్ సర్కిల్స్‌ లో వినిపిస్తోన్న లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే, వినాయక్ కి మెగాస్టార్ ఛాన్స్ ఇచ్చాడని.. కాకపోతే ఆ సినిమాకి లూసిఫర్ సినిమాకి ఎలాంటి సబందం లేదని.. రచయిత ఆకుల శివ రాసిన స్క్రిప్ట్ మెగాస్టార్ కి బాగా నచ్చిందని.. దాదాపు సంవత్సరం నుండి వినాయక్, ఆకుల శివ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నాడని.. వినాయక్ – మెగాస్టార్ కలయికలో వచ్చే సినిమా ఇదేనని, వినాయక్ డైరెక్షన్ టీమ్ లోని ఓ సభ్యుడు చెబితున్న మాట. నిజానికి వినాయక్ ఖైదీ సినిమా చేస్తోన్న టైంలోనే మెగాస్టార్ కి ఆకుల శివ చేత స్టోరీ లైన్ ను చెప్పించాడట.

    అయితే మెగాస్టార్ వెంటనే మళ్లీ వినాయక్ తో చేస్తే బాగోదు అని.. తన మేనల్లుడు సాయి తేజ్ తో ఒక సినిమా చేసి పెట్టమని వినాయక్ కోరడం.. వినాయక్ కూడా మెగాస్టార్ మాటను కాదనలేక.. సాయితేజ్ తో సినిమా చేసి ప్లాప్ డైరెక్టర్ గా ముద్ర వేయించుకోవడం చకచకా జరిగిపోయాయి. ఆ ప్లాప్ దెబ్బకు వినాయక్ మళ్లీ మెగాస్టార్ దగ్గరకు వెళ్లలేదు. ఆ తరువాత బాలయ్య బాబుతో ఓ సినిమా ప్లాన్ చేసాడు, అది ఎందుకో సెట్స్ పైకి వెళ్లలేదు. ఆ తరువాత రవితేజతో కూడా మరో సినిమా అనుకున్నాడు. ఈ సినిమా కూడా మధ్యలోనే ఆగిపోయింది.

    Also Read: ప్రభాస్‌ హాలీవుడ్‌ ఎంట్రీ?

    ఈ లోపే తానే హీరోగా ఒక సినిమా రావడం.. దాంతో యాక్టింగ్ వైపు ఆసక్తి చూపడం..అంతలో డైరెక్టర్ గా వినాయక్ కి చాలా గ్యాప్ వచ్చింది. దాంతో ఏ స్టార్ హీరో పిలిచి వినాయక్ కి డేట్స్ ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. పైగా వినాయక్ మార్కెట్ కూడా పూర్తిగా పడిపోవడం ఆయనను స్టార్ హీరోలకు దూరం చేసింది. అయితే మెగాస్టార్ ఉండగా, ఇక డైరెక్టర్ కి స్టార్ డమ్ ఎందుకు.. అందుకే మెగాస్టార్, వినాయక్ ని పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు. ఈ సినిమాకి ఆకుల శివ కథ మాటలు అందిస్తున్నాడు.