Shah Rukh Khan: తోటి హీరోలపై షారుఖ్ సంచలన కామెంట్స్… వస్తుంటారు పోతుంటారు అంటూ!

కెరీర్లో అనే ఒడిదుడుకులు చూశారు. పఠాన్ ముందు వరకు షారుఖ్ పరిస్థితి దారుణంగా ఉంది. వరుస పరాజయాలతో అయోమయంలో పడ్డాడు. ఎన్ని ప్రయోగాలు చేసినా ఫలితం ఇవ్వలేదు.

Written By: NARESH, Updated On : December 2, 2023 2:44 pm

Shah Rukh Khan

Follow us on

Shah Rukh Khan: మూడు దశాబ్దాలుగా షారుఖ్ ఖాన్ నట ప్రస్థానం సాగుతుంది. 90లలో ఆయన అతిపెద్ద స్టార్ గా అవతరించాడు. షారుఖ్ నటించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్స్ దేశాన్ని ఊపేశాయి. ఎలాంటి నేపథ్యం లేకుండా బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ ఎదిగారు. కెరీర్లో అనే ఒడిదుడుకులు చూశారు. పఠాన్ ముందు వరకు షారుఖ్ పరిస్థితి దారుణంగా ఉంది. వరుస పరాజయాలతో అయోమయంలో పడ్డాడు. ఎన్ని ప్రయోగాలు చేసినా ఫలితం ఇవ్వలేదు.

దాంతో బ్రేక్ తీసుకున్నాడు. స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిన పఠాన్ తో భారీ బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఏకంగా రూ.1000 కోట్ల క్లబ్ లో చేరాడు. ఆ వెంటనే మరో బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. జవాన్ మూవీ పఠాన్ రికార్డులు బద్దలు కొట్టింది. సౌత్ ఇండియా దర్శకుడు అట్లీ జవాన్ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఒక్క షారుఖ్ సినిమాలతో 2023లో బాలీవుడ్ రూ. 2000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

ఆయన నుండి వస్తున్న మూడో చిత్రం డంకీ. రాజ్ కుమార్ హిరానీ దర్శకుడు కావడంతో ప్రత్యేకత సంతరించుకుంది. ఇది రాజ్ కుమార్ హిరానీ మార్క్ ఎమోషనల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అని తెలుస్తుంది. మాస్ అంశాలు ఆశించలేము. డంకీ డిసెంబర్ 21న విడుదల కానుంది. దీంతో షారుఖ్ ప్రమోషన్స్ షురూ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేశాడు. కాగా ఓ నెటిజెన్ చేసిన కామెంట్ పై షారుఖ్ ఆసక్తికరంగా స్పందించారు.

‘క్షమించాలి సర్, డంకీ మూవీ కోసం నేను ఎంతగానో ఎదురుస్తున్నాను. అయితే మీరు హీరో అని కాదు, రాజ్ కుమార్ హిరానీ దర్శకుడు అని’ అంటూ కామెంట్ పెట్టాడు. దీనికి సమాధానంగా షారుఖ్…’అవును నువ్వు చెప్పింది నిజమే. నేను కూడా రాజ్ కుమార్ మూవీలో నటించినందుకు చాలా ఉత్కంఠగా ఉన్నాను. సినిమా అనేది దర్శకుడి భావ వ్యక్తీకరణ. హీరో వచ్చి పోతుంటాడు అంతే, అన్నారు. షారుఖ్ ఇక్కడ తనను తగ్గించుకున్నాడు. అదే సమయంలో డైరెక్టర్ ముందు హీరోలు నథింగ్ అన్నట్లు మాట్లాడాడు.