https://oktelugu.com/

Shah Rukh Khan: అల్లు అర్జున్ రేంజ్ ని మ్యాచ్ చేయడం నా వల్ల కాదు అంటూ షారుఖ్ ఖాన్ సెన్సేషనల్ కామెంట్స్!

కోహ్లీ, డేవిడ్ వార్నర్, రవీంద్ర జడేజా వంటి క్రికెట్ లెజెండ్స్, అంతర్జాతీయ ఫుట్ బాల్ ప్లేయర్స్, జాతీయ స్థాయి రాజకీయ నాయకులూ ఇలా ఎంతో మంది ఎదో ఒక సందర్భంలో పుష్ప మ్యానరిజం ని పబ్లిక్ లో అనుసరించి ఆశ్చర్యానికి గురి అయ్యేలా చేసారు.

Written By:
  • Vicky
  • , Updated On : October 1, 2024 / 03:21 PM IST

    Shah Rukh Khan(1)

    Follow us on

    Shah Rukh Khan: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నటించిన ‘పుష్ప’ చిత్రం ఎలాంటి సెన్సేషన్ సృష్టించిందో మన అందరికీ తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2021 వ సంవత్సరం లో విడుదలై పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమా తెలుగు ఆడియన్స్ కంటే ఎక్కువగా హిందీ ఆడియన్స్ కి బాగా నచ్చింది. అందుకే ఇప్పుడు ‘పుష్ప 2’ కోసం అక్కడి ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పుష్ప లో అల్లు అర్జున్ వేసిన స్టెప్పులు, ఆయన అనుసరించిన మ్యానరిజమ్స్, చూపించిన యాటిట్యూడ్, ఇలా ఆ సినిమాకి సంబంధించిన ప్రతీ అంశం చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ళ వరకు అనుసరించారు. ఇప్పటికీ పుష్ప మ్యానరిజమ్స్ ని మన రొటీన్ లైఫ్ లో ఎదో ఒక సందర్భంలో వాడుతూనే ఉంటాం. కేవలం ఆడియన్స్ మాత్రమే కాదు, సెలెబ్రిటీలు కూడా పుష్ప మేనియా లో మునిగి తేలారు.

    కోహ్లీ, డేవిడ్ వార్నర్, రవీంద్ర జడేజా వంటి క్రికెట్ లెజెండ్స్, అంతర్జాతీయ ఫుట్ బాల్ ప్లేయర్స్, జాతీయ స్థాయి రాజకీయ నాయకులూ ఇలా ఎంతో మంది ఎదో ఒక సందర్భంలో పుష్ప మ్యానరిజం ని పబ్లిక్ లో అనుసరించి ఆశ్చర్యానికి గురి అయ్యేలా చేసారు. జనాలను అల్లు అర్జున్ తన యాక్టింగ్ స్టైల్ తో ఈ రేంజ్ లో ప్రభావితం చేసాడు కాబట్టే ఆయనకీ నేషనల్ అవార్డు దక్కింది. ఇది ఇలా ఉండగా రీసెంట్ గా బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కూడా అల్లు అర్జున్ పై ఎలివేషన్స్ వేయడం అందరినీ షాక్ కి గురి చేసింది. అబుదాబిలో ఇటీవలే ‘ఇండియన్ ఫిలిం ఫెడరేషన్ అకాడమీ(IIFA) అవార్డ్స్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. ఈ ఈవెంట్ కి కోలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, శాండిల్ వుడ్ నుండి ఎంతో మంది దిగ్గజ నటులు, సూపర్ స్టార్స్ హాజరయ్యారు. ఈ ఈవెంట్ కి షారుఖ్ ఖాన్, విక్కీ కౌశల్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఈ ఈవెంట్ లో విక్కీ కౌశల్ పుష్ప క్యారక్టర్ ని ఇమిటేట్ చేస్తూ ఒక మ్యానరిజం చేస్తాడు.

    దానికి షారుఖ్ ఖాన్ సమాధానం చెప్తూ ‘విక్కీ నువ్వు అల్లు అర్జున్ సార్ యాటిట్యూడ్, స్వాగ్ ని మ్యాచ్ చేయలేవు..నా వల్ల కూడా అది అవ్వదు’ అంటూ చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే విక్కీ కౌశల్ కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా తెరకెక్కుతున్న ‘చావా’ చిత్రం డిసెంబర్ 6 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అదే రోజున అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 : ది రూల్’ చిత్రం కూడా విడుదల అవుతుంది. ఛత్రపతి మహారాజ్ తనయుడి జీవిత చరిత్రని ఆధారంగా తీసుకొని ‘చావా’ చిత్రాన్ని తెరకెక్కించారు. మరి ఈ రెండు సినిమాల్లో ఎవరిదీ పై చెయ్యి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన విషయం.