https://oktelugu.com/

Balakrishna: ‘అన్ స్టాపబుల్ 3’ కోసం బాలయ్య డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే నోరెళ్లబెడుతారు..హీరోగా కూడా ఇంతే తీసుకోలేదుగా!

ఇండస్ట్రీ లో ఉన్న టాప్ స్టార్స్ అందరితో ఇంటర్వ్యూస్ చేస్తూ, వాళ్ళతో సరదాగా ఆయన మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి. మొదటి సీజన్ బంపర్ హిట్ అవ్వడంతో రెండవ సీజన్ ని కూడా చేసారు. ఈ సీజన్ మొదటి సీజన్ కంటే పెద్ద హిట్ అయ్యింది.

Written By:
  • Vicky
  • , Updated On : October 1, 2024 / 02:52 PM IST

    Balakrishna(6)

    Follow us on

    Balakrishna: బాలయ్య బాబు లో సరికొత్త యాంగిల్ ని బయటకి తీసిన షో ఏదైనా ఉందా అంటే అది ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ టాక్ షో అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. బాలయ్య ఒక గేమ్ షో కి హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు అని అప్పట్లో వార్త రాగానే బాలయ్య ఏంటి?, హోస్ట్ ఏంటి?, అసలు ఆయనకు ఇలాంటి సూట్ అవుతాయా అని అభిమానులు కూడా అనుకున్నారు. కానీ సూట్ అవ్వడం కాదు, తనకు మించి ఎవ్వరూ కూడా హోస్ట్ చేయలేరని ఈ షో ద్వారా నిరూపించుకున్నాడు బాలయ్య. ఇండస్ట్రీ లో ఉన్న టాప్ స్టార్స్ అందరితో ఇంటర్వ్యూస్ చేస్తూ, వాళ్ళతో సరదాగా ఆయన మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి. మొదటి సీజన్ బంపర్ హిట్ అవ్వడంతో రెండవ సీజన్ ని కూడా చేసారు. ఈ సీజన్ మొదటి సీజన్ కంటే పెద్ద హిట్ అయ్యింది.

    ఈ రెండు సీజన్స్ కి కలిపి పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు ముఖ్య అతిథులుగా హాజరు అయ్యారు. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ ఒక్కరే మిగిలి ఉన్నారు. అలాగే బాలకృష్ణ జనరేషన్ కి సంబంధించిన టాప్ స్టార్స్ వెంకటేష్, నాగార్జున మరియు మెగాస్టార్ చిరంజీవి వంటి వారు కూడా ఈ షోకి రావాల్సి ఉంది. వీళ్లందరినీ కవర్ చేయడానికి అతి త్వరలోనే ‘అన్ స్టాపబుల్ 3’ ప్రారంభం కాబోతుంది. దసరా కానుకగా మొదటి ఎపిసోడ్ ని స్ట్రీమింగ్ చేయబోతుందట ఆహా మీడియా. ఈ మొదటి ఎపిసోడ్ కి దుల్కర్ సల్మాన్ ముఖ్య అతిథిగా విచ్చేస్తాడని టాక్. దుల్కర్ సల్మాన్ హీరో గా ‘లక్కీ భాస్కర్’ అనే చిత్రం తెరకెక్కింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించింది. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

    ఈ సందర్భంగా ప్రొమోషన్స్ లో భాగంగా దుల్కర్ మొదటి ఎపిసోడ్ కి రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా ‘అన్ స్టాపబుల్’ సీజన్ 3 కోసం బాలయ్య బాబు డిమాండ్ చేస్తున్న రెమ్యూనరేషన్ కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సీజన్ లో మొత్తం 14 ఎపిసోడ్స్ ఉంటాయట. ఈ 14 ఎపిసోడ్స్ కి గాను బాలయ్య బాబు అల్లు అరవింద్ ని 20 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేస్తున్నాడట. బాలయ్య ఒక్కో సినిమాకు 10 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటాడు. కానీ అన్ స్టాపబుల్ షో కోసం ఆయన రెండింతలు డిమాండ్ చేయడం ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది. ‘అన్ స్టాపబుల్’ షో కారణంగానే ‘ఆహా’ మీడియా ఇండియా లోనే టాప్ మోస్ట్ ఓటీటీ యాప్స్ లో ఒకటిగా నిల్చింది, కాబట్టి బాలయ్య ఆ మాత్రం డిమాండ్ చేయడంలో తప్పు లేదంటూ అభిమానులు అంటున్నారు.