Jawan Collections: జవాన్ రెండో రోజు వసూళ్లు … బాక్సాఫీస్ ఊచకోత

పఠాన్ తో ఫామ్ లోకి వచ్చిన షారుఖ్, జవాన్ సినిమాతో దానిని కొనసాగిస్తున్నాడు. తన గత సినిమా రికార్డ్స్ మాత్రమే కాకుండా ఇండియన్ సినిమా రికార్డ్స్ బద్దలు కొట్టే పనిలో ఉన్నాడు ఈ కింగ్ ఖాన్.

Written By: Shiva, Updated On : September 9, 2023 10:11 am

Jawan Collections

Follow us on

Jawan Collections: సరైన సినిమా పడితే బాక్సాఫీస్ వద్ద సూపర్ స్టార్స్ రేంజ్ ఎలా ఉంటుందో తాజాగా విడుదలైన జైలర్, జవాన్ మూవీస్ నిరూపిస్తున్నాయి. ముఖ్యంగా షారుఖ్ ఖాన్ విషయంలో అనేక ట్రోల్స్ వచ్చాయి. ఏజ్ అయిపోయింది, గ్రేస్ తగ్గింది, ఇక సినిమాలు ఆపేయటమే మంచిది అనే సలహాలు వచ్చాయి. కానీ వాటిని లెక్కచేయని షారుఖ్ తన సత్తా ఏంటో చూపిస్తున్నాడు. గాయపడిన సింహం నుండి వచ్చే గర్జన ఎంత భయంకరంగా ఉంటుందో చూపిస్తున్నారు.

పఠాన్ తో ఫామ్ లోకి వచ్చిన షారుఖ్, జవాన్ సినిమాతో దానిని కొనసాగిస్తున్నాడు. తన గత సినిమా రికార్డ్స్ మాత్రమే కాకుండా ఇండియన్ సినిమా రికార్డ్స్ బద్దలు కొట్టే పనిలో ఉన్నాడు ఈ కింగ్ ఖాన్. సౌత్ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన జవాన్ సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తుంది. విడుదలైన మొదటి రోజు దాదాపు 130 కోట్లకు పైగా వసూళ్లు సాధించి పఠాన్ పేరుమీద ఉన్న 106 కోట్ల రికార్డును చెరిపేసింది. తొలిరోజు దాదాపు 74 కోట్ల నెట్ సాధించి హౌరా అనిపించింది.

ఇక రెండో రోజు (శుక్రవారం ) వసూళ్లు విషయానికి వస్తే మొదటిరోజు కంటే 20% తక్కువ వసూళ్లు చేసింది జవాన్. కేవలం రెండు రోజుల్లోనే 200 కోట్ల క్లబ్ లోకి చేరింది ఈ సినిమా. వస్తున్నా రిపోర్ట్స్ ప్రకారం రెండో రోజు దాదాపు 55 కోట్ల నెట్ వసూళ్లు చేసింది జవాన్. దీనితో మొదటి రెండు రోజుల్లో 125 కోట్లు పైగా నెట్ సాధించింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే నార్త్ ఇండియా 135 కోట్లు, సౌత్ ఇండియా 65 కోట్లు కలిపి కేవలం ఇండియాలో 200 కోట్ల బిజినెస్ చేసింది.

ఇక ఓవర్శిస్ లో మరో 105 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఓవరాల్ గా చూస్తే 305 కోట్ల బిజినెస్ జరిగింది జవాన్ కి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 175 కోట్ల నెట్ వసూళ్లు చేయాల్సి ఉంది. జవాన్ దూకుడు చూస్తుంటే మొదటి ఐదు రోజుల్లోనే లాభాల్లోకి వచ్చే అవకాశం ఉంది. శనివారం, ఆదివారం వసూళ్లు మొదటిరోజు కంటే ఎక్కువగా ఉండే అవకాశం లేకపోలేదు. ఇక ఫైనల్ గా జవాన్ సినిమా మొదటి రెండు రోజుల్లో దాదాపు 238 కోట్లు గ్రాస్ సాధించింది. మొదటి నాలుగు రోజుల్లోనే 500 కోట్ల క్లబ్ లో చేరనుంది ఈ సినిమా