https://oktelugu.com/

Ram Charan: రామ్ చరణ్ కోసం షారుఖ్ ఖాన్..బాలీవుడ్ లో ‘గేమ్ చేంజర్’ క్రేజ్ మామూలుగా లేదుగా!

జనవరి 10వ తారీఖున తెలుగుతో పాటు హిందీ, తమిళంలో విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రొమోషన్స్ వచ్చే నెలలో వేరే లెవెల్లో ఉండబోతున్నాయట. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ సినిమాని ప్రొమోషన్స్ ని డైరెక్టర్ శంకర్ చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నాడట. మొన్న టీజర్ లాంచ్ ఈవెంట్ ని కూడా లక్నో లో నిర్వహించారు.

Written By:
  • Vicky
  • , Updated On : November 13, 2024 / 06:22 PM IST

    Ram Charan(8)

    Follow us on

    Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ చిత్రం పై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రీసెంట్ గా విడుదలైన టీజర్ తో ఆ అంచనాలు పదింతలు ఎక్కువ అయ్యాయి. వింటేజ్ శంకర్ మార్క్ అంటే ఎలా ఉంటుందో ఈ టీజర్ ని చూస్తే అర్థం అవుతుంది అంటూ అభిమానులు సోషల్ మీడియా ఎంతో ఆనందంగా చెప్పుకొచ్చారు. జనవరి 10వ తారీఖున తెలుగుతో పాటు హిందీ, తమిళంలో విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రొమోషన్స్ వచ్చే నెలలో వేరే లెవెల్లో ఉండబోతున్నాయట. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ సినిమాని ప్రొమోషన్స్ ని డైరెక్టర్ శంకర్ చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నాడట. మొన్న టీజర్ లాంచ్ ఈవెంట్ ని కూడా లక్నో లో నిర్వహించారు. ఈ ఈవెంట్ కి భారీ ఎత్తున అభిమానులు హాజరై కేరింతలతో ఆడిటోరియం దద్దరిల్లిపోయేలా చేసారు.

    అయితే వచ్చే నెలలో ఈ సినిమా హిందీ వెర్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీ గా ప్లాన్ చేశారట మేకర్స్. #RRR మూవీ హిందీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మీ అందరికి గుర్తు ఉండే ఉంటుంది. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా సల్మాన్ ఖాన్ విచ్చేశాడు. ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా అలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ ఈవెంట్ కి షారుఖ్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నట్టు సమాచారం. షారుఖ్ ఖాన్ కి రామ్ చరణ్ చాలా మంచి స్నేహితుడు. జవాన్, పఠాన్ వంటి సినిమాల విడుదల సమయంలో ఈ విషయాన్నీ షారుఖ్ సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చాడు. హైదరాబాద్ లో జవాన్ సినిమాని అభిమానులతో కలిసి థియేటర్ లో చూడాలి అని ఒక అభిమాని ట్విట్టర్ రిక్వెస్ట్ చేయగా, దానికి షారుఖ్ ఖాన్ సమాధానం చెప్తూ ‘కచ్చితంగా చేస్తాను..కానీ ఆరోజు నాతో పాటు రామ్ చరణ్ కూడా రావాలి’ అని అంటాడు. దీనిని బట్టీ వీళ్లిద్దరి మధ్య ఎంత స్నేహం ఉందో అర్థం చేసుకోవచ్చు.

    కేవలం షారుఖ్ ఖాన్ తో మాత్రమే కాదు, సల్మాన్ ఖాన్ తో కూడా రామ్ చరణ్ కి ఎంతో మంచి సాన్నిహిత్యం ఉంది. రామ్ చరణ్ అడిగిన వెంటనే ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ కూడా తీసుకోకుండా సల్మాన్ ఖాన్ ‘గాడ్ ఫాదర్’ చిత్రంలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ‘గేమ్ చేంజర్’ సినిమా విడుదల సమయంలో సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 18 వీకెండ్ ఎపిసోడ్ లో రామ్ చరణ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ‘గేమ్ చేంజర్’ చిత్రాన్ని ప్రమోట్ చేసుకునే ఆలోచనలో ఉన్నాడట. ఇప్పటికే గేమ్ చేంజర్ చిత్రానికి బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు ఈ ప్రొమోషన్స్ తో ఆ క్రేజ్ తారాస్థాయికి చేరుకోనుంది.