https://oktelugu.com/

Rashi Khanna : అతన్ని వదిలించుకున్నాక నా జీవితం అందంగా తయారైంది అంటూ తన బ్రేకప్ లవ్ స్టోరీ పై రాశీ ఖన్నా హాట్ కామెంట్స్!

ఇంటర్వ్యూస్ లో ఆమె తన జీవితంలో చోటు చేసుకున్న కొన్ని చేదు జ్ఞాపకాలను తలచుకొని ఎమోషనల్ అయ్యింది. ఆమె మాట్లాడుతూ 'నా లవ్ బ్రేకప్ అయ్యినప్పుడు నేను చాలా బాధపడ్డాను. మానసికంగా కృంగిపోయాను, ఏ పని మీద చాలా కాలం వరకు శ్రద్ద పెట్టలేకపోయాను. ఆ తర్వాత నాకు నేను ధైర్యం చెప్పుకొని బలంగా నిలబడ్డాను.

Written By:
  • Vicky
  • , Updated On : November 13, 2024 / 06:20 PM IST

    Rashi Khanna

    Follow us on

    Rashi Khanna : అందంతో పాటు అద్భుతమైన యాక్టింగ్ టాలెంట్ ఉన్న యంగ్ హీరోయిన్స్ లో ఒకరు రాశీ ఖన్నా. ‘మనం’ చిత్రంలో ఒక చిన్న పాత్ర ద్వారా వెండితెరకి పరిచయమైనా ఈమె, ఆ తర్వాత ‘ఊహలు గుసగుసలాడే’ అనే చిత్రంతో హీరోయిన్ గా మారింది. ఆ సినిమా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా, రాశీ ఖన్నా కి మంచి క్రేజ్ ని తీసుకొచ్చింది. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఈమె, యూత్, ఫ్యామిలీ, మాస్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని దక్కించుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమాలను పూర్తిగా తగ్గించేసిన ఈమె బాలీవుడ్ లో వరుస సినిమాలను చేస్తుంది. గుజరాత్ లో జరిగిన అల్లర్లు, గోద్రా రైలు దహన కాండ ఆధారంగా తెరకెక్కించిన ‘ది సబర్మతి రిపోర్ట్’ అనే చిత్రం లో ఈమె హీరోయిన్ గా నటించింది. నవంబర్ 15 న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రొమోషన్స్ లో భాగంగా ఆమె పలు ఇంటర్వ్యూస్ ఇచ్చింది.

    ఈ ఇంటర్వ్యూస్ లో ఆమె తన జీవితంలో చోటు చేసుకున్న కొన్ని చేదు జ్ఞాపకాలను తలచుకొని ఎమోషనల్ అయ్యింది. ఆమె మాట్లాడుతూ ‘నా లవ్ బ్రేకప్ అయ్యినప్పుడు నేను చాలా బాధపడ్డాను. మానసికంగా కృంగిపోయాను, ఏ పని మీద చాలా కాలం వరకు శ్రద్ద పెట్టలేకపోయాను. ఆ తర్వాత నాకు నేను ధైర్యం చెప్పుకొని బలంగా నిలబడ్డాను. కెరీర్ మీద ఫోకస్ పెట్టి నేడు ఈ స్థాయికి చేరుకున్నాను. ఇప్పుడు నా లవ్ బ్రేకప్ గురించి తల్చుకొని ఆనందిస్తున్నాను. ఆ వ్యక్తిని వదిలేయడం వల్లే నేను నా కెరీర్ మీద ఫోకస్ పెట్టి ఈ స్థాయికి చేరుకోగలిగాను. అందుకు నాకు సంతోషంగా ఉంది. నా కష్ట సమయంలో నాకు తోడుగా కుటుంబ సభ్యులు, స్నేహితులు నిలిచారు. నాకు ఇండస్ట్రీ లో ఉన్న స్నేహితులకంటే బయట ఉన్న స్నేహితులే ఎక్కువ. అన్ని విధాలుగా వాళ్ళు నాకు సహాయం చేస్తూనే ఉంటారు’ అని చెప్పుకొచ్చింది రాశీ ఖన్నా.

    ఇంకా ఆమె మాట్లాడుతూ ‘నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం సౌత్ ఇండియా ప్రేక్షకులు. వాళ్ళు నా మీద చూపించిన ప్రేమాభిమానాలను అంత తేలికగా మర్చిపోలేను. నా మొదటి సినిమా ‘ఊహలు గుసగుసలాడే’ సూపర్ హిట్ అయ్యింది. నేను నా కుటుంబం తో కలిసి ఆ సమయంలో తిరుపతికి వెళ్ళాను. అక్కడ వేలాది మంది జనాలు ఒక్కసారిగా దూసుకొచ్చేసారు. వీళ్లంతా ఎవరు అని నా మ్యానేజర్ ని అడగగా, వాళ్లంతా నీకోసమే వచ్చారు మేడం అని చెప్పాడు. ఈ సంఘటన నేను ఇప్పటికీ మర్చిపోలేదు. ఆరోజు జనాలు లిమిట్ ని మించి రావడంతో పెద్ద ఎత్తున తోపులాట కూడా జరిగింది. నా బౌన్సర్లు వాళ్ళని కంట్రోల్ చేయలేక ఇబ్బంది పడ్డారు’ అంటూ చెప్పుకొచ్చింది రాశీ ఖన్నా.