Aryan Khan in Arthur Road Jail: విలాసవంతమైన జీవితం… తండ్రికున్న ప్రపంచవ్యాప్తి పరపతితో కొడుకుకూడా అదేస్థాయిలో గౌరవమర్యాదలు పొందాడు. పొద్దున లేచింది మొదలు.. రాత్రి పడుకునేంత వరకు అడిగినవన్నీ.. క్షణాల్లో కళ్లముందు ఉండేవి. పంచభక్ష పరమన్నాలు తినేంత భాగ్యం అతడిది. శాషించి.. ఆదేశించే వ్యక్తి చేసిన చిన్న పొరపాటు ఇప్పుడతడి జీవితాన్నే మార్చేసింది. హత్యలు.. అత్యాచారాలు.. దేశానికే ద్రోహం చేసిన ఉగ్రవాదుల చుట్టూ అతడో నిందితుడిగా ప్రస్తుతం జీవనం సాగిస్తున్నాడు. అతడే.. ముంబాయి నుంచి గోవా వెళ్తున్న క్రాయిజ్ షిప్ లో డ్రగ్స్ సేవించి రేవ్ పార్టీ జరుపుకుంటున్నారని ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టయిన బలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్.

ఆర్యన్ ఖాన్ చిన్నవయసు యువకుడు. విలాసవంతమైన జీవనం కావడంతో పుట్టిన రోజు వేడుకలో భాగంగా డ్రగ్స్ తీసుకుంటూ.. దొరికాడని ఎన్సీబీ అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. వెంటనే కోర్టులో ప్రవేశపెట్టగా.. రిమాండ్ విధించింది కోర్టు పలుమార్లు బెయిల్ కూడా దరఖాస్తు చేసుకోగా.. నిరాకరించింది ముంబయి కోర్టు. దీంతో ఆర్యన్ కు ముంబయిలోని అర్థర్ రోడ్డులో ఉన్న సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంచారు. ఉల్లాసవంతమైన జీవనం గడుపుతూ.. స్నేహితులతో టూర్లంటూ.. విదేశాలకు వెళ్లే ఆర్యన్ ప్రస్తుతం సెంట్రల్ జైలులో బిక్కుబిక్కుమంటూ చిప్పకూడు తింటున్నాడు.
ఇదే జైలులో కరుడుగట్టిన ఉగ్రవాదులు, దేశద్రోహులు, మాఫియా డాన్ లు గడిపారు. ప్రస్తుతం ఆర్యన్ ఖాన్ తో పాటు అతడి స్నేహితులు జైలులో మగ్గుతున్నారు. ఇంతకన్నా ముందు ఇక్కడ బాలీవుడ్ టాప్ హీరో సంజయ్ దత్ కూడా జైలు జీవితం గడిపారు. మాఫియా డాన్ చోటారాజన్ ఇదే జైలులో ఉన్నారు. వీరితో పాటు చాలా మంది ఉగ్రవాదులు గడిపిన జైలు ఇదీ.. ప్రస్తుతం బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ చేసిన తప్పుకు శిక్షను అనుభవిస్తున్నారు. ఎంత విలాసవంత జీవనం గడిపినా.. కూడా తప్పు చేస్తే శిక్ష తప్పదని ఆర్యన్ ను చూస్తున్నవారు చెబుతున్నారు.