Prakash Raj: ‘మా’ ఎన్నికల్లో చేసిన రాజకీయాలకు రాజకీయ నాయకుల ఎత్తులు కూడా సరిపోవు. ఎమ్మెల్యేగా పోటీ చేసే వాళ్ళు కూడా ఇన్ని ఆరోపణలు చేసుకోరు, ఇంతగా ఒకరి పై ఒకరు హేళన చేసుకోరు. ఏది ఏమైనా వీళ్లంతా చేసుకున్న విమర్శలకు సినీ కళామతల్లి కూడా తల దించుకుంది. మొత్తానికి ‘మా’ ఎన్నికల కోసం నెల రోజుల నుంచి జరుగుతున్న హడావుడికి ముగింపు వచ్చేసింది. అయితే, ప్రకాష్ రాజ్ ఓడిపోవడానికి ముఖ్య కారణం… మెగా ఫ్యామిలీనే అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇది నిజమే కావొచ్చు. ఎదుకంటే.. మెగా కుటుంబం ప్రకాష్ రాజ్ కి సపోర్ట్ చేశారు. చివరకు నాగబాబు ఇదే విషయాన్ని పబ్లిక్ గా చెప్పినా కూడా ప్రకాష్ రాజ్ కి ఓటు వెయ్యటానికి మెగా ఫ్యామిలీ నుంచి ఒక్క చిరంజీవి, చరణ్ తప్ప, ఇంకెవ్వరూ రాలేదు. అల్లు అర్జున్, అల్లు శిరీష్, వరుణ్ తేజ్, నిహారిక, వైష్ణవ్ తేజ్, ఇలా మెగా ఇంటి మనుషులే రాలేదు. అందుకే, ఈ ఎన్నికల్లో ఓడినా ప్రకాష్ రాజ్ కి పోయిందేమి లేదు. కానీ, అవమానం మాత్రం మెగా ఫ్యామిలీకే.
మెగా ఫ్యామిలీని నమ్ముకోవడం కంటే, ఆ ఫ్యామిలీని తిట్టే వాళ్ళని నమ్ముకోవడం నయం అని ఈ రోజు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు అంటే.. అందుకు కారణం.. ఈ ఎన్నికలే. విష్ణు గెలుపు కు ప్రకాష్ రాజ్ ఓటమి కి కారణమైన నాగబాబు నోటి దులకు, పొగరుకు ఎవరు బాధ్యులు ?. నిజానికి చిరంజీవి చాలా ఆలోచించి మాట్లాడతాడు.
పవన్ కళ్యాణ్ మాట్లాడాక ఆలోచిస్తాడు. కానీ, నాగబాబు మాత్రం ఆలోచించి మాట్లాడడు. మాట్లాడాక ఆలోచించడు. అలాంటి వ్యక్తీ గనుకే.. ఈ రోజు మెగా కుటుంబం పరువు పోయింది. ఇప్పటికైనా నాగబాబు తన పొగరుబోతు పద్ధతిని మార్చుకోవాలి. నిజానికి కరోనా టైములో చిరు ఆర్టిస్ట్ లకు అన్నం పెట్టారు. అవసరం అయిన వారికి ఆక్సిజన్ సీలిండెర్స్ పంచారు.
కానీ, ఆ ఆర్టిస్ట్ లు కుడా చిరు సపోర్ట్ చేసిన ప్రకాష్ రాజ్ కి ఓటు వేయలేదు అంటే.. కారణం నాగబాబునే. చిరంజీవి గారు, సినిమా ఇండస్ట్రీలోని వ్యక్తులకు ఎంతో సాయం చేశారు. కానీ, ఈ ఎన్నికల్లో మెగాస్టార్ కి అవమానం జరిగింది అంటే.. కారణం నాగబాబునే. ‘తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూర్యుడు ఒక్కడే సూర్యుడిలా ఉదయించే మెగాస్టార్ చిరంజివి ఒక్కడే’ అని అభిమానులు సంకలు గుద్దుకోవడమే తప్ప, అందులో వాస్తవం లేదని తేలిపోయింది.
ఇక ప్రకాష్ రాజ్ ఓటమి తర్వాత మెగాస్టార్ హితబోధ చేశారు. పదవులు తాత్కాలికం. వాటి కోసం మనం మాటలు అనడం, అనిపించుకోవడం మంచది కాదు. బయటవారికి లోకువ అయిపోతాం’ అంటూ అంతా అయిపోయాక చిరంజీవి హితబోధ చేశాడు. అయినా లోకువ అయిపోతాం ఏమిటి, నాగబాబు పుణ్యమా అని ఆల్ రెడీ చిరంజీవి లోకువ అయిపోయాడు కదా.