https://oktelugu.com/

Shah Rukh Khan: బాత్రూంలో ఏడ్చేవాడిని.. బోరుమన్న స్టార్ హీరో..లోపల ఇంత బాధ ఉందా?

ప్రజలు తమ వైఫల్యాలపై దృష్టి సారించే బదులు ఆత్మపరిశీలన చేసుకోవాలని షారుఖ్ ఖాన్ ఇలా అన్నారు.

Written By:
  • Rocky
  • , Updated On : November 19, 2024 / 09:58 PM IST

    Shah Rukh Khan

    Follow us on

    Shah Rukh Khan: సూపర్ స్టార్ షారుక్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయనకు మన దేశంలో పాటు విదేశాల్లోనూ కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. విదేశాల్లో కూడా ఆయన సినిమాలకు విపరీతమైన ఆదరణ ఉంది. షారుక్ ఖాన్‌కి విదేశాల్లో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన స్టైల్‌కి కోట్లాది మంది అభిమానులున్నారు. ఇప్పుడు మరోసారి కింగ్ ఖాన్ తనదైన శైలితో అంతర్జాతీయ వేదికపై తనదైన ముద్ర వేశారు. నవంబర్ 19వ తేదీ ఉదయం షారూఖ్ దుబాయ్ ఎగ్జిబిషన్ సెంటర్, ఎక్స్‌పో సిటీలో జరిగిన గ్లోబల్ ఫ్రైట్ సమ్మిట్‌లో పాల్గొన్నారు. అక్కడ ఆయన తన స్టార్‌డమ్ నుండి తనకున్న బిజినెస్ లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కెరీర్లో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన తన చిత్రాల గురించి కూడా చర్చించారు. కెరీర్‌ ప్రారంభంలో ఫెయిల్యూర్స్‌ వచ్చినప్పుడు ఆయన.. ఎవరికీ తెలియకుండా బాత్‌రూమ్‌లో ఏడ్చేవారట. దుబాయిలో నిర్వహించిన ఓ సమ్మిట్‌లో ఆయన చెప్పిన విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తన నట ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ అతిథుల్లో స్ఫూర్తినింపేందుకు ప్రయత్నించారు బాద్ షా. ఈ కార్యక్రమానికి అతిథిగా షారుక్ ఖాన్ హాజరయ్యారు. కింగ్ ఖాన్ తన కెరీర్‌లో 100కి పైగా సినిమాలు చేశాడు. మోడరేటర్‌తో మాట్లాడుతున్నప్పుడు.. షారుక్ తన స్టార్‌డమ్ గురించి మాత్రమే కాకుండా అతని వైఫల్యాల గురించి మాట్లాడాడు. వాటిని ఎలా ఎదుర్కొన్నాడో తెలిపారు.

    ఫెయిల్యూర్‌పై షారుక్ ఏమన్నారంటే ?
    ప్రజలు తమ వైఫల్యాలపై దృష్టి సారించే బదులు ఆత్మపరిశీలన చేసుకోవాలని షారుఖ్ ఖాన్ ఇలా అన్నారు. ‘మీరు మీ లక్ష్యాన్ని చేరుకునేటప్పుడు ఊహించని పరిస్థితులు ఎదురైతే కుంగిపోవద్దు. అప్పుడు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవడం ఉత్తం. అసలు తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుని కొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్లాలి. ఒకానొక సమయంలో.. నా సినిమాలు బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో బాత్‌రూమ్‌లోకి వెళ్లి ఏడ్చేవాడిని. ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడేవాడిని. ఆ బాధ నుంచి మళ్లీ నేనే బయటకు వచ్చా. ప్రపంచం ఎప్పుడూ మనకు వ్యతిరేకం కాదు. ఎవరి కుట్ర వల్లనో నా సినిమాలు ఆడకపోవడం అనేది జరుగదు.. నేనే ప్రేక్షకులకు కనెక్ట్‌కాలేకపోయా. ఇది నా తప్పే’ అని గ్రహించాను. తర్వాత విజయాలు అందుకోగలిగా. మీరెప్పుడూ ‘నాకే ఎందుకిలా జరుగుతోంది?’ అని కుంగిపోవద్దు. ఇతరులను నిందించకుండా.. అనుకుంది సాధించి జీవితాన్ని ఆస్వాదించండి అన్నారు షారూఖ్ ఖాన్.

    కెరీర్ ఆరంభంలోనే కాదు.. కొన్నాళ్ల క్రితం వరకు బాద్ షాకు సరైన హిట్ లేదు. అరడజనుకు పైగా సినిమాలు ఫ్లాపులు బ్యాక్ టు బ్యాక్ వచ్చాయి. కమర్షియల్ సినిమా అయినా, డిఫరెంట్ స్టోరీ అయినా, స్క్రిప్ట్ కోసం తనని తాను పూర్తిగా మార్చుకున్నా… షారుక్ ఏం చేసినా అసలు హిట్ మాత్రం రాలేదు. అలాంటి సమయంలో, 2023 షారుఖ్ ఖాన్ కి పునరాగమన సంవత్సరం అయ్యింది. బ్యాక్ టు బ్యాక్ మూడు హిట్స్ తో తన టైమ్ ఇంకా అయిపోలేదని నిరూపించుకున్నాడు షారుఖ్. ఆ మూడు సినిమాలతో కలిపి రూ.1000 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. అదే జోష్ తో తన తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నాడు. గతేడాది విడుదలైన ‘పఠాన్‌’, ‘జవాన్‌’ చిత్రాలు బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. రెండూ రూ.1000కోట్లకుపైగా వసూళ్లు చేశాయి. మరోవైపు, ‘డంకీ’, ‘టైగర్‌ 3’లతోనూ ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం ‘కింగ్‌’ సినిమాలో నటిస్తున్నారు.