Bollywood: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో సినిమాలను చేస్తున్న హీరోలు మన తెలుగు హీరోలే కావడం విశేషం… బాలీవుడ్ ప్రేక్షకులు సైతం తెలుగు సినిమాల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ హీరోలు చేస్తున్న సినిమాల్లో ఏమాత్రం కంటెంట్ ఉండడం లేదని వాళ్ళు చేసే సినిమాలు ప్రేక్షకులను ఎంగేజ్ చేయడం లేదనే ఉద్దేశంతో వాళ్లు మన సినిమాల వైపు చూస్తుండటం విశేషం…ఇక ప్రస్తుతం తెలుగు డైరెక్టర్ల మీద హీరోలు కన్నేసిన విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే షారుక్ ఖాన్, బుచ్చిబాబు డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం బుచ్చిబాబు పెద్ది సినిమా చేస్తున్నప్పటికి ఈ సినిమా అయిపోయిన తర్వాత షారుఖ్ తనతోనే బుచ్చిబాబు సినిమా చేయాలని ప్రణాళికలు రూపొందించుకుంటున్నాడు…
ఇక ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా పూర్తి అయిన తర్వాత హరీష్ శంకర్ సైతం సల్మాన్ ఖాన్ తో సినిమా చేయబోతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి. రీసెంట్ గా సల్మాన్ ఖాన్ కలిసి కథ కూడా వినిపించినట్టుగా తెలుస్తోంది…ఇక అమీర్ ఖాన్ సైతం వంశీ పైడిపల్లి తో సినిమా సెట్ చేసుకున్నాడు.
తొందర్లోనే ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్ మెంట్ కూడా రాబోతోంది. ఇక ఏది ఏమైనా కూడా ఖాన్ త్రయం మొత్తం తెలుగు డైరెక్టర్ల మీద ఆధారపడడం అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఒకప్పుడు తెలుగు సినిమాలన్నా, తెలుగు డైరెక్టర్ల పేరు చెప్పిన పట్టించుకోని వీళ్ళు ఇప్పుడు ఏరికోరి మరి తెలుగు డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. అంటే మన వాళ్ళ క్రేజ్ ఎక్కడికి వెళ్ళిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం తెలుగు సినిమాలకు ఉన్న డిమాండ్ ఇండియాలో ఏ సినిమాలకు లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మన స్టార్ హీరోలు సైతం అలాంటి ఇమేజ్ nj సంపాదించుకున్నారు. కాబట్టి మన హీరోలతో సినిమాలు చేయడానికి బాలీవుడ్ డైరెక్టర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు… చూడాలి మరి ఫ్యూచర్లో మన దర్శకులు మన ఇండస్ట్రీని ఏ స్థాయి కి తీసుకెళ్తారు అనేది…