Dhee Judge Poorna: డాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ కొత్త పుంతలు తొక్కుతోంది. కామెడీ, రొమాన్స్, గ్లామర్ కలగలిపి ఫుల్ మీల్స్ లాంటి ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులకు వడ్డించేస్తున్నారు. ప్రారంభంలో ఢీ షోకి ఇలాంటి హంగులు లేవు. కేవలం ఒక యాంకర్, జడ్జెస్ తో లాగించేసేవారు. ఈ షోకి భారీ టీఆర్పీ దక్కుతుండగా మార్పులు చేసుకుంటూ వచ్చారు. జబర్దస్త్ కామెడీ గ్యాంగ్ ని ఇందులోకి దించారు.

యాంకర్ గా రష్మీ, సుడిగాలి సుధీర్,హైపర్ ఆది రాకతో షో మరింత జోరందుకుంది. ఈ క్రమంలో జడ్జెస్ విషయంలో కూడా సమూల మార్పులు చేశారు. ఒకప్పుడు ప్రొఫెషనల్ కొరియోగ్రాఫర్స్ జడ్జెస్ గా ఉండేవారు. వాళ్ళ స్థానంలో హీరోయిన్స్ ప్రియమణి, పూర్ణలను తీసుకున్నారు. వీరి మధ్యలో శేఖర్ మాస్టర్ జడ్జిగా కూర్చునేవాడు. ఇక లేటెస్ట్ సీజన్ లో శేఖర్ మాస్టర్ స్థానంలో గణేష్ మాస్టర్ వచ్చి చేరారు.
కాగా ప్రియమణి, పూర్ణ రియాలిటీ షోలలో జడ్జి సాంప్రదాయాలను బ్రేక్ చేశారు. యాంకర్స్ నుండి కంటెస్టెంట్స్ వరకు ఎవరినీ వదలకుండా రొమాన్స్ చేస్తున్నారు. పూర్ణ అయితే ఓ అడుగు ముందుకేసి ఏకంగా డాన్సర్స్ బుగ్గలు కొరికేస్తుంది. షోలో బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇస్తే చాలు పూర్ణ సదరు డాన్సర్ బుగ్గ అమాంతంగా కొరికేస్తుంది. ఈ విషయంలో ఆడా మగా అనే తేడాలు కూడా చూడటం లేదు.
Also Read: కొత్త బంగారులోకం మూవీలో బ్లండర్ మిస్టేక్ ఏంటో తెలుసా?
లేటెస్ట్ ఎపిసోడ్ లో డాన్సర్ కావ్య వరుడు కావలెను మూవీలోని దిగుదిగు దిగునాగా… సాంగ్ ని పెర్ఫార్మ్ చేశారు. ఈ సాంగ్ ముగియగానే కావ్యను దగ్గరకు పిలిచి బుగ్గ గట్టిగా కొరికేసి తన ఎమోషన్ తీర్చేసుకుంది. కావ్య అమ్మాయి కాబట్టి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. గతంలో ఇద్దరు మేల్ కంటెస్టెంట్స్ బుగ్గలు కూడా కొరికేసింది. పూర్ణ తీరుకు బుల్లితెర ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. ఇకనైనా ఈ బుగ్గలు కొరికే సాంప్రదాయానికి స్వస్తి పలకాలని కోరుకుంటున్నారు.
మరో వైపు పూర్ణ నటిగా కొనసాగుతున్నారు. ఆమె వెబ్ సిరీస్ లతో పాటు స్టార్ హీరోల సినిమాల్లో కీలక రోల్స్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన దృశ్యం, అఖండ చిత్రాలలో పూర్ణ ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేసి మెప్పించారు.
Also Read: యాంకర్ అనసూయ ఇంట్లో విషాదం