Sequel Movies: ‘బాహుబలి’ సినిమా రెండు పార్టులుగా వచ్చి సూపర్ సక్సెస్ ని సాధించింది. ఇక ఆ సినిమా తర్వాత పుష్ప సైతం రెండు భాగాలుగా తెరకెక్కింది. పాన్ ఇండియాలో మంచి విజయాన్ని సాధించింది. దాంతో సీక్వెల్ సినిమాల మీద అంచనాలు తార స్థాయిలోకి వెళ్లిపోయాయి…ఏ స్టార్ హీరో సినిమా అయిన కూడా చివర్లో పార్ట్ 2 ఉంటుందని దాన్ని కంటిన్యూ చేస్తూ దానికి తొందరలోనే సీక్వెల్ రాబోతుంది అంటూ అనౌన్స్ చేస్తున్నారు. కానీ వాటిలో చాలా సినిమాలకు సీక్వెల్స్ రావడం లేదు. మొదటి పార్టు సక్సెస్ అయితే ఆ సినిమాకు సీక్వెల్ రెడీ అవుతోంది. లేకపోతే మాత్రం సీక్వెల్స్ ను పట్టించుకునే నాధుడు కూడా ఉండడు. ఇక ఇలాంటి క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ చేసిన దేవర సినిమా సైతం మంచి విజయాన్ని అందుకున్నప్పటికి ‘దేవర 2’ సినిమా కూడా ఉంటుందని సినిమా చివర్లో అనౌన్స్ చేశారు.
ఇక రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ సైతం దేవర 2 సినిమా ఉంటుందని పలు ఈవెంట్లలో తెలియజేసినప్పటికి ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఆ మూవీ అటకెక్కినట్టుగా తెలుస్తోంది. కారణం ఏంటి అంటే మొదటి పార్టు 500 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఇక రెండో పార్ట్ బడ్జెట్ భారీగా పెరిగిపోతోంది. ఇక ఈ సీక్వెల్ కి 600 కోట్ల బడ్జెట్ అవుతోందట.
ప్రస్తుతం ఎన్టీఆర్ కి ఉన్న మార్కెట్ ను బట్టి సినిమా సక్సెస్ అయితే పర్లేదు కానీ లేకపోతే ప్రోడ్యూసర్స్ నష్టపోయే అవకాశమైతే ఉంటుంది.
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ‘కింగ్ డమ్’ సినిమా భారీ ఎత్తున రిలీజ్ అయింది. అయినప్పటికి ఈ సినిమా స్లో నరేషన్ తో ఉండడం, యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను అంతగా ఇంప్రెస్ చేయకపోవడం డైరెక్షన్ లో గౌతం తిన్నానురీ అనుసరించిన విధానాలు ప్రేక్షకులను పెద్దగా ఎక్సైట్ కి గురి చేయకపోవడం వల్ల ఈ సినిమా ప్లాప్ అయింది…
ఇక మొదట ఈ సినిమాని రెండు పార్టులుగా తెరకెక్కిద్దాం అనుకన్నారు. కానీ మొదటి పార్టు ఆడకపోవడంతో రెండో పార్ట్ ను కూడా ఆపేస్తున్నట్టుగా మేకర్స్ నుంచి కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి… మొత్తానికైతే ఇప్పుడు తెలుగులో స్టార్ హీరోల సినిమాలకు సీక్వెల్స్ ఆగిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది…