YS Sharmila: ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల( AP Congress chief Sharmila) అందుబాటులోకి వచ్చారు. గత కొంతకాలంగా ఆమె సైలెంట్ గా ఉన్నారు. అయితే ఇప్పుడు ఉన్నఫలంగా వచ్చి ప్రధాని మోదీ వ్యాఖ్యలను ఖండించారు. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పై మోదీ చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు షర్మిల. అయితే గత కొంతకాలంగా షర్మిల పెద్దగా సందడి చేయలేదు. రాజకీయంగాను సైలెంట్ గా ఉన్నారు. దీంతో ఆమెపై రకరకాల ప్రచారం నడిచింది. షర్మిల సోదరుడు జగన్మోహన్ రెడ్డితో సంధి చేసుకున్నారని.. ఇద్దరు త్వరలో కలిసిపోబోతున్నారని.. అందుకే ఆయనపై విమర్శలు తగ్గించారన్నది సోషల్ మీడియాలో ఆమెపై జరిగిన ప్రచారం. అంతటితో ఆగలేదు ఆ ప్రచారం. త్వరలో పిసిసి చీఫ్ పోస్టు నుంచి తొలగిస్తారని టాక్ కూడా మొదలైంది. సరిగ్గా అదే సమయంలో షర్మిల సైతం పొలిటికల్ యాక్టివిటీ తగ్గించారు. దీంతో ఆమె పని అయిపోయిందని అంతా భావించారు. కానీ ఇప్పుడు ఉన్నఫలంగా మీడియా ముందుకు వచ్చి బిజెపిని గట్టిగానే నిలదీసినంత పని చేశారు. అయితే ఆమె జాతీయ పార్టీ అధ్యక్షురాలు కాబట్టి.. జాతీయ అంశాలు పై మాట్లాడితే ఎలా? ఏపీలో నెలకొన్న సమస్యలపై కూటమి ప్రభుత్వాన్ని నిలదీయవచ్చు కదా అని సెటైర్లు పడుతున్నాయి.
సోదరుడుతో సంధి..
ఇటీవల షర్మిలను టార్గెట్ చేసుకొని సోషల్ మీడియాలో( social media) ఒక ప్రచారం నడిచింది. కొందరు వైయస్ కుటుంబ అభిమాన నేతలు ఎంటర్ అయ్యారని.. జగన్మోహన్ రెడ్డితో ఆమెకు సంధి చేశారన్నది ఆ ప్రచారం. ఇలా కొట్టుకుంటూ పోతే ప్రత్యర్థులకే లాభం అని వైయస్ కుటుంబ అభిమానులు ఆమెకు హేతబోధ చేసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఆమె మనస్సు కరిగి సోదరుడుకు దగ్గరయ్యారని కూడా ప్రచారం జరిగింది. అదే సమయంలో ఆమె కూటమి ప్రభుత్వం పై కొన్ని రకాల విమర్శలు చేశారు. అదిగో షర్మిల మనసు మార్చుకున్నారని మరింత ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆమె కొద్దిరోజులుగా సైలెన్స్ పాటించారు. ఇప్పుడు ఏకంగా మీడియా ముందుకు వచ్చి జాతీయ అంశాలు మాట్లాడారు. జవహర్లాల్ నెహ్రూ ను దూషిస్తారా అంటూ ప్రధాని నరేంద్ర మోడీపై విరుచుకుపడ్డారు.
అధ్యక్ష బాధ్యతలు కష్టమే..
అయితే మరోవైపు కాంగ్రెస్ చీఫ్ పదవి నుంచి ఆమెను తొలగిస్తారని ప్రచారం అయితే జరుగుతుంది. ఆమె నియామకం జరిగి రెండేళ్లు అవుతోంది. కాంగ్రెస్ పార్టీ ఒక్క అడుగు ముందుకు వేయలేకపోతోంది. పైగా ఆమె బాధ్యతలు తీసుకున్న సమయానికి ముందు ఒకరిద్దరు సీనియర్లు యాక్టివ్గానే ఉండేవారు కాంగ్రెస్ పార్టీలో. రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా ఆమెకు బాధ్యతలు అప్పగించడంతో వైసిపి ఖాళీ అయిపోతుందని అంతా అంచనా వేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పేరు మోసిన వైసిపి నేతలంతా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం సాగింది. కానీ అందుకు జాతీయస్థాయిలో కాంగ్రెస్ పతనం అడ్డుకట్ట వేసింది. ఒక్కో రాష్ట్రంలో ఆ పార్టీ అపజయం పాలు అవుతూ వచ్చింది. ఈ క్రమంలో ఏపీలో సైతం నేతలు ఆ పార్టీలో చేరేందుకు సంశయించారు. ఒక విధంగా ఇది షర్మిలకు బ్యాడ్ టైం.