https://oktelugu.com/

టాలీవుడ్ అంతా సీక్వెల్స్ మయమే !

ఒక సినిమా హిట్ అయిందంటే.. ఇక ఆ సినిమా సీక్వెల్ రావడం అనేది ప్రస్తుతం ఒక ఆనవాయితీ అయిపోయింది. ఈ మధ్య తెలుగు సినీ ఇండస్ట్రీలో కూడా సీక్వెల్స్ హవా బాగానే హల్ చల్ చేస్తోంది. ఆ మాటకొస్తే, ఒక్క తెలుగే కాదు మిగిలిన ఇండస్ట్రీలు కూడా హిట్ సినిమాల సీక్వెల్స్ తోనే బిజీగా ఉన్నాయి. కొత్త కథలతో కుస్తీ పట్టి ఓడిపోవడం కంటే.. హిట్ కథలనే అటు ఇటుగా మార్చుకుని కనీసం ఏవరేజ్ హిట్ అన్నా […]

Written By:
  • admin
  • , Updated On : January 6, 2021 / 10:38 AM IST
    Follow us on


    ఒక సినిమా హిట్ అయిందంటే.. ఇక ఆ సినిమా సీక్వెల్ రావడం అనేది ప్రస్తుతం ఒక ఆనవాయితీ అయిపోయింది. ఈ మధ్య తెలుగు సినీ ఇండస్ట్రీలో కూడా సీక్వెల్స్ హవా బాగానే హల్ చల్ చేస్తోంది. ఆ మాటకొస్తే, ఒక్క తెలుగే కాదు మిగిలిన ఇండస్ట్రీలు కూడా హిట్ సినిమాల సీక్వెల్స్ తోనే బిజీగా ఉన్నాయి. కొత్త కథలతో కుస్తీ పట్టి ఓడిపోవడం కంటే.. హిట్ కథలనే అటు ఇటుగా మార్చుకుని కనీసం ఏవరేజ్ హిట్ అన్నా కొట్టుకోవడం ఉత్తమం అని ఫిక్స్ అయ్యారు మేకర్స్. కాకపోతే భారీ అంచనాలతో రిలీజ్ అయ్యే ఈ సీక్వెల్స్ సక్సెస్ రేట్ అనేది, హిస్టరీని బట్టి చూస్తే తక్కువుగానే ఉంది. రాజమౌళి ఒక్కడే ‘బాహుబలి’ సినిమాని రెండు భాగాలుగా తీసి భారీ సక్సెస్ కొట్టగలిగాడు.

    Also Read: ప్రభాస్ ‘ఆది పురుష్’లో స్టార్ హీరో కొత్త లుక్ !

    అయినప్పటికీ ఈ ఏడాదిలో తెలుగు ప్రేక్షకుల ముందుకు అర డజనుకు పైగా సీక్వెల్స్ భారీ అంచనాలతో రాబోతున్నాయి. ముందుగా కన్నడ రాకింగ్ స్టార్ యష్ – దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రానున్న ‘కేజీఎఫ్ చాప్టర్-1’ సీక్వెల్ ‘కేజీఎఫ్ చాప్టర్-2’ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. యావత్ మాస్ అభిమానులంతా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. అలాగే మంచు విష్ణు – శ్రీను వైట్ల కాంబినేషన్ లో ‘డి అండ్ డి – డబుల్ డోస్’ అనే ‘ఢీ’ సినిమా సీక్వెల్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో 2007లో వీరి కాంబోలో వచ్చిన సూపర్ హిట్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఢీ’కి సీక్వెల్ గా ఇన్నేళ్ల తరువాత ఈ చిత్రం రావడం విశేషం.

    ఇక చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ – కలర్స్ స్వాతి జంటగా నటించిన ‘కార్తికేయ’ సినిమా సీక్వెల్ ‘కార్తికేయ 2’ కూడా ఈ ఏడాది రాబోతుంది. ఇందులో నిఖిల్ కి జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. మొదటి భాగానికి ఏ మాత్రం తగ్గకుండా ఈ సీక్వెల్ స్క్రిప్ట్ ని రెడీ చేసాడట చందు. ఇక అన్నిటికీ మించి అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సూపర్ హిట్ మూవీ ‘ఎఫ్ 2’ ఫ్రాంచైజీలో ‘ఎఫ్ 3’ సినిమా రానుంది ఈ సంవత్సరం. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ కి మోర్ ఫన్ ని జోడిస్తూ ఈ సినిమా తీస్తుండటంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

    Also Read: స్టార్ వారసుడి చిరకాల కోరిక తీరుతుందా ?

    టాలెంటెడ్ యాక్టర్ అడవి శేష్ నటించిన స్పై థ్రిల్లర్ ‘గూఢచారి’ సీక్వెల్ ‘గూఢచారి 2’ స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయింది. మార్చి నుండి ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఆలాగే ‘హిట్’ సినిమాకి సీక్వెల్ ‘హిట్ 2’ కూడా రానుంది. ఇక అక్కినేని నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రానికి సీక్వెల్ రాబోతోందని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్