Vijay Antony Daughter
Vijay Antony Daughter: కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన పెద్ద కూతురు మీరా ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకొని చనిపోవడంతో ఆ కుటుంబం మానసికంగా కృంగిపోయింది. ఈ విషాదం దేశ వ్యాప్తంగా సినీ ప్రముఖులను , సినీ అభిమానులను కలచివేసింది. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు కంటి ముందే ఇలా బలవన్మరణం చెందటంతో విజయ్ ఆంటోని ని ఓదార్చటం ఎవరి వల్ల కావడం లేదు.
కూతురు మీరా పోస్ట్ మార్టం అనంతరం విజయ్ ఆంటోని మరింత బాధలోకి కూరుకుపోయాడు. తాజాగా అతను చేసిన వాట్సాప్ చాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నా కూతురు మీరా చాలా దయ, క్షమాగుణం కలిగిన వ్యక్తి. అంతే కాకుండా ధైర్యవంతురాలు. కానీ అనూహ్యమైన నిర్ణయం తీసుకొన్నారు. కులం, మతం, డబ్బు, శతృత్వం, బాధ, పేదరికం, విద్వేషాలు లేని.. ప్రపంచంలో ఎవరూ వెళ్లలేని మంచి ప్రదేశానికి వెళ్లారు. ప్రస్తుతం ఆమె ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నారు అని విజయ్ ఆంటోని చెప్పారు.
నా కూతురు మీరా రోజు నాతో మాట్లాడుతుంది. నేను నా కూతురితో కలిసి జీవిస్తున్నాను. నా కూతురితో బ్రతుకుతున్న , ఇక నేను చేసే మంచి పనులు నా మీరా పేరుమీద చేస్తాను. మంచి పనులు చేయమని నా మీరా నాకు చెబుతుంది అంటూ విజయ్ ఆంటోని చేసిన చాట్ వైరల్ అవుతుంది. ఈ పోస్ట్ చూస్తే ఒక తండ్రిగా విజయ్ పడుతున్న బాధ ఏమిటో అర్థం అవుతుంది.
ఇక మరోవైపు మీరా ఆత్మహత్య వెనుక గల కారణాలు ఇవే అంటూ తమిళ మీడియా చేస్తున్న అతి శృతి మించి పోయింది. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు అనేక కారణాలు చెబుతూ ఆమె మృతిని తమ వ్యూస్ కోసం వాడుకుంటున్నారు. దీనిపై తమిళ సినీ పరిశ్రమ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇక నుంచి పరిశ్రమకు చెందిన వాళ్ళ ఇంట్లో ఏమైనా ఇలాంటి సంఘటనలు జరిగితే మీడియా ను దూరంగా పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది