https://oktelugu.com/

Kia Seltos: రెండు నెలల్లోనే 50 వేల బుకింగ్సా? ఏం కారు సామీ ఇది? ఇంతలా ఎందుకు ఎగబడుతున్నారు?

కియా సెల్టోస్ వివరాల్లోకి వెళితే.. 1.5 లీటర్ పెట్రోల, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్లను కలిగి ఉంది. 115 బీహెచ్ పీ పవర్, 144 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : September 22, 2023 1:41 pm
    Kia Seltos

    Kia Seltos

    Follow us on

    Kia Seltos: సాధారణంగా ఒక కారు మార్కెట్లోకి వచ్చాక కొన్ని నెలల తరువాత సక్సెస్ అవుతుంది. కానీ ఇప్పుడు చాలా కంపెనీకి మోడల్ ను ముందుగానే సోషల్ మీడియా ద్వారా అడ్వర్టయిజ్మెంట్ చేస్తుండడంతో కారు కొనాలనుకునేవారు వాటికి ఆకర్షితులైపోతున్నారు. ఈ తరుణంలో ఆకట్టుకునే ఫీచర్స్, యాక్సెసిరీస్ ఉండడంతో ఫిదా అయిపోతున్నారు. దీంతో కారు నచ్చడంతో ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే బుక్ చేసుకుంటున్నారు. అయితే తాజాగా ఓ కంపెనీకి చెందిన కారు 2 నెలల్లో ఏకంగా 50 వేలను బుక్ చేసుకున్నారు. ఇంతకు ఏం కారు అది? ఏముంది అందులో?

    కారు ప్రియులంతా ఇప్పుడు Sports Utility Vehicle (SUV)కోసం చూస్తున్నారు. ఈ తరుణంలో కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా ఈ మోడల్ నే తయారు చేస్తున్నాయి. ఎస్ యూవీని బేస్ చేసుకొని హ్యుందాయ్ కంపెనీ క్రెటాను గత నెలలో రిలీజ్ చేయగా 13,832 ఉత్పత్తులను విక్రయించింది. దీంతో క్రెటాను మించిన కారు లేదనుకున్నారు. కానీ అంతకుమించి అన్నట్లుగా కియా గట్టి పోటీ ఇస్తుంది. కియా సెల్టోస్ వినియోగదారులను ఆకర్షిస్తూ దూసుకుపోతుంది.

    దక్షిణ కొరియాకు చెందిన కియా కంపెనీ భారత మార్కెట్లను ఏలుతుందని చెప్పొచ్చు. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన ‘సెల్టోస్’ రెండు నెలల్లో ఏకంగా 50 వేల యూనిట్లను విక్రయించిందంటే నమ్మశక్యం కాదు. ఇందులో ఉండే అదనపు సేప్టీ ఫీచర్స్ వినియోగదారులను ఆకర్షిస్తోందని అంటున్నారు. అంతేకాకుండా అనువైన ధరలు ఆకర్షిస్తున్నాయని చెబుతున్నారు. ఆకర్షించే డిజైన్ తో పాటు అప్డేట్ ఫీచర్స్ ను ఇందులో అమర్చారు.

    కియా సెల్టోస్ వివరాల్లోకి వెళితే.. 1.5 లీటర్ పెట్రోల, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్లను కలిగి ఉంది. 115 బీహెచ్ పీ పవర్, 144 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎస్ యూవీ 6-స్పీడ్ మాన్యువల్, సీవీటీ గేర్ బాక్స్ తో పాటు 6- స్పీడ్ ఐఎంటీ, ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్ ను కూడా అమర్చారు. సెల్టోస్ లో అదనంగా పెద్ద బంపర్ ను కలిగి ఉంటుంది. కొత్త ఎల్ ఈడీ డైటైమ్ రన్నింగ్ ల్యాంప్స్ తో పాటు ఫేస్ లిప్ట్ 18 ఇంచుల అలాయ్ వీల్స్ ను కలిగి ఉన్నాయి. ఈ కారుకు వెనుకవైపున ఎల్ ఈడీ లైట్ బార్ కు కనెక్ట్ చేసిన కొత్త ఇన్వర్టెడ్ ఎల్ ఆకారపు టెయిల్ లైట్లు ఉన్నాయి.

    10.25 ఇంచుల డిస్ ప్లేతో పాటు డ్యూయెల్ స్క్రీన్ సెటప్ ను కలిగి ఉండడంతో పాటు నలుపు, తెలుపు అంతర్గత థీమ్ జీటీ లైన్ లో అందుబాటులో ఉంది. 8 ఇంచెస్ హెడ్స్, అప్ డిస్ ప్లే ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, రెయిన్ పెన్సిన్ వైపర్ లో, బోస్ ట్యూన్డ్ 8 స్పీకర్ సిస్టమ్ ఇందులో అలరిస్తుంది. ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్ , టైర్ ఫైజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్ోల్, హిల్ అసిస్ట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి. ఇన్ని అద్భుత పీచర్లు కలిగిన ఈ మోడల్ రూ.10.89 లక్షల నుంచి విక్రయిస్తున్నారు.