Coolie Movie Review: ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరు మంచి సినిమాలను చేస్తూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే రజినీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన కూలీ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
Also Read: కోలీవుడ్ 1000 కోట్ల కల ‘కూలీ’ నెరవేర్చేనా..? మొదటి రోజు వసూళ్లు ఎలా ఉన్నాయంటే!
కథ
ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే దేవా(రజినీకాంత్) ఒక మెన్షన్ ను నడిపిస్తుంటాడు.అయితే అనుకోకుండా దేవా తన ప్రాణ స్నేహితుడికి దూరం అవ్వాల్సి వస్తోంది. దేవా కి అతని ఫ్రెండ్ కి మధ్య ఏం జరిగింది..? వీళ్ళ గొడవలోకి సైమన్ (నాగార్జున) అనే గ్యాంగ్ స్టార్ ఎలా వచ్చాడు అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమాతో లోకేష్ కనకరాజు మరోసారి స్టార్ట్ డైరెక్టర్ గా తనను తాను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేశాడు…కథ కొంచెం రొటీన్ గా అనిపించినప్పటికి కథనంలో మాత్రం ఆయన చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ముఖ్యంగా ఫస్టాఫ్ మీద చాలా ఎక్కువ శ్రద్ధ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సినిమాలో చాలా క్యారెక్టర్లు ఉండడంవల్ల ప్రేక్షకులు ఏ క్యారెక్టర్ తో రన్ అవ్వాలి అనేది కొంతవరకు కన్ఫ్యూజన్ అయితే వచ్చింది. రజనీ క్యారెక్టర్ ను హుక్ చేస్తూ మిగతా క్యారెక్టర్ లని దానికి సపోర్టుగా వాడుకోవాలి అనే విషయంలో లోకేష్ చాలా వరకు సక్సెస్ అయ్యాడు… ముఖ్యంగా వింటేజ్ రజనీకాంత్ ను తీసుకువచ్చి అతనిలో ఉన్న స్వాగ్ ను ఎలివేట్ చేశాడు.
సినిమా సెకండ్ హాఫ్ లో కొంతవరకు స్లోగా అయినట్టు అనిపించినప్పటికి వెంటనే యాక్షన్ ఎలిమెంట్స్ తో సినిమా మీద ఇంట్రెస్ట్ ని తీసుకొచ్చాడు. ముఖ్యంగా ఫ్రీ క్లైమాక్స్ లో ఒక ఎలివేషన్స్ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఇంకా క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ సైతం ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతుంది… అనిరుధ్ మ్యూజిక్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో ఆయన స్పెషల్ కేర్ తీసుకున్నాడు. ముఖ్యంగా రజనీకాంత్ ఎంట్రీ అప్పుడు వస్తున్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇక నాగార్జున కనిపించినప్పుడు వచ్చే బిజిఎం బాగుంది. మొత్తానికైతే ఈ సినిమా లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే కీలక పాత్ర వహించిందనే చెప్పాలి…
నాగార్జున పాత్రను మలిచిన తీరు బాగుంది…. మిగతా ఆర్టిస్టులందరిని వాడుకున్న విధానం కూడా బాగుంది. ప్రతి క్యారెక్టర్ కి ఒక ఆర్కనైతే ఇచ్చారు. అయితే లోకేష్ కనకరాజు స్క్రిప్ట్ మీద ఫోకస్ పెట్టినంతగా డైరెక్షన్ మీద ఫోకస్ అయితే పెట్టలేదు అనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా స్క్రీన్ ప్లే మీద కూడా ఆయన చాలా పట్టు సాధించారు. కానీ దర్శకత్వంలో మాత్రం కొంతవరకు డీలాపడ్డారనే చెప్పాలి.
ఇంతకు ముందు విక్రమ్ సినిమాలో ఆయన డైరెక్షనే సినిమాకి ప్లస్ అయింది. కానీ ఇక్కడ మాత్రం ఆయన డైరెక్షన్ సినిమా మీద ఏ మాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోయింది… ప్రతి క్యారెక్టర్ లో ఉన్న షేడ్స్ ని డిఫరెంట్ గా ప్రెసెంట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. అంత ఒకే కానీ లోకేష్ మాత్రం డైరెక్షన్ విషయంలోనే కొంతవరకు గాడి తప్పడనే చెప్పాలి…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో రజనీకాంత్ నటించడం కాదు జీవించాడనే చెప్పాలి. దేవా పాత్రలో ఆయన ఒదిగిపోయి ప్రేక్షకులను మైమరిపింప చేశాడు. ముఖ్యంగా ఆయన మార్క్ డైలాగులను అద్భుతంగా చెప్పి యాక్షన్ సన్నివేశాల్లో కూడా సూపర్ స్టార్ ఇస్ బ్యాక్ అనేలా ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టించాడు…ఇక నాగార్జున చేసిన సైమన్ పాత్ర కి కూడా చాలా ఇంపార్టెన్స్ అయితే ఉంది. నాగార్జున ఈ పాత్రలో ఒదిగిపోయి నటించడమే కాకుండా విలనిజంలో ఒక డిఫరెంట్ షేడ్స్ ను చూపించాడు. ఇక ఈ సినిమాతో నాగార్జున విలన్ పాత్రను కూడా అద్భుతంగా చేయగలరు అని ఒక మార్కనైతే సంపాదించుకున్నాడు. అక్కినేని అభిమానులకు ఇది ఫుల్ జోష్ ను ఇచ్చే విషయం అనే చెప్పాలి…
ఇక ఉపేంద్ర కూడా తన మార్క్ నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. ఆయన నుంచి ప్రేక్షకులు ఏదైతే కోరుకుంటారో అలాంటి ఒక డిఫరెంట్ పాత్రని స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడమే కాకుండా తన హావ భావాలు సైతం ప్రేక్షకులను మెప్పిస్తాయి… శృతిహాసన్ సైతం తన పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించింది. సత్యరాజ్ కూడా ఈ సినిమాలో డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించడమే కాకుండా ఇంతకుముందు తాను చేయనటువంటి ఒక సపరేట్ పాత్రను పోషించి తనకంటూ ఒక ఐడెంటిటి సంపాదించుకున్నాడు…
Also Read: ‘కూలీ’ ఓవరాల్ పబ్లిక్ టాక్ ఇదే..బాక్స్ ఆఫీస్ రేంజ్ ఎక్కడ దాకా వెళ్తుందో చూడాలి!
టెక్నికల్ అంశాలు
ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకి అనిరుధ్ అందించిన మ్యూజిక్ గాని, బ్యాక్గ్రౌండ్ స్కోరు గాని నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. కొన్ని ఎలివేషన్స్ సీన్స్ లో ఆయన అద్భుతంగా బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. దానివల్లే కొన్ని సీన్స్ కూడా టాప్ లెవల్ కి వెళ్లిపోయాయి. ముఖ్యంగా బ్యాక్ షాట్స్ అయితే ప్రతి ఒక్కరి కి బాగా నచ్చుతాయి. వాటితోనే లోకేష్ కొంతవరకు మ్యాజిక్ అయితే చేశాడు… ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడ తగ్గకుండా బాగా రిచ్ గా ఉన్నాయి…
ప్లస్ పాయింట్స్
రజినీకాంత్ యాక్టింగ్
మ్యూజిక్
విజువల్స్
మైనస్ పాయింట్స్
డైరెక్షన్
సెకండాఫ్ లో కొన్ని సీన్స్…
రేటింగ్
ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.5/5