Ustad Bhagat Singh : పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) వరుసగా ఇప్పుడు తాను బ్యాలన్స్ పెట్టిన సినిమాలను పూర్తి చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే ‘హరి హర వీరమల్లు'(Hari Hara VeeraMallu) చిత్రాన్ని పూర్తి చేసాడు. వచ్చే నెల 12 న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే ఆయన ‘ఓజీ'(They Call Him OG) మూవీ సెట్స్ లోకి అడుగుపెట్టాడు. నాలుగు రోజుల పాటు షూటింగ్ లో పాల్గొన్నాడు. త్వరలోనే ముంబై లో ప్లాన్ చేసిన భారీ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నాడు. పది రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్ తో సినిమా చివరి దశకు వస్తుంది. ఆ తర్వాత పూణే లో ఒక రోజు, థాయిలాండ్ లో ఒకరోజు, ఆంధ్ర ప్రదేశ్ లోని తాడేపల్లి లో నాలుగు రోజుల షూటింగ్ జరగనుంది. జూన్ 10 లోపు షూటింగ్ పూర్తి చెయ్యాలని అనుకున్నారు కానీ, మధ్యలో కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలు ఉండడం వల్ల తాత్కాలికంగా బ్రేక్ పడింది.
‘ఓజీ’ మూవీ షూటింగ్ పూర్తి అయిన వెంటనే ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) చిత్రాన్ని ప్రారంభించబోతున్నాడు పవన్ కళ్యాణ్. ఈ చిత్రానికి కూడా భారీగా డేట్స్ ఇచ్చేశాడట. నెలకు 15 రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడట. అలా డిసెంబర్ లోపు ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేయాలనీ అనుకుంటున్నారు. అయితే ఈ సినిమా తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన విజయ్ ‘తేరి’ కి రీమేక్ గా తెరకెక్కుతుంది అని ఇన్ని రోజులు ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ లో రీమేక్ చేస్తే అభిమానులు అసలు ఒప్పుకోవడం లేదనే విషయాన్నీ గమనించిన పవన్ కళ్యాణ్ సరికొత్త కథ ని సిద్ధం చేయమని హరీష్ శంకర్ కి చెప్పాడట. పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం హరీష్ శంకర్ ఒక కొత్త స్క్రిప్ట్ ని రెడీ చేశాడట. ఈ స్క్రిప్ట్ అద్భుతంగా వచ్చిందని టాక్.
Also Read : ఉస్తాద్ భగత్ సింగ్ స్టోరీ లో భారీ మార్పులు చేస్తున్న హరీష్ శంకర్ మళ్ళీ రీ షూట్ చేస్తారా..?
అయితే నేడు హనుమాన్ జయంతి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్ ని ట్విట్టర్ లో షేర్ చేసింది మూవీ టీం. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కాబోతుంది అంటూ ఒక సరికొత్త పోస్టర్ ద్వారా తెలియజేసారు. అసలు పవన్ కళ్యాణ్ అభిమానులు ‘హరి హర వీరమల్లు’ మూవీ ఊపు లో ఉన్నారు. ఈ సమయం లో సంబంధం లేకుండా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అప్డేట్ ని ఇవ్వడం ఏంటి అని కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు మండిపడగా, నాన్ స్టాప్ గా పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ వస్తున్నాయి అంటూ సంతోషిస్తున్నారు. ఈ ఏడాది లోనే షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసి పవన్ కళ్యాణ్ కి మరో గబ్బర్ సింగ్ ఇవ్వాలనే కసితో ఉన్నాడు డైరెక్టర్ హరీష్ శంకర్. ఆయన గత చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ ఎంత పెద్ద ఫ్లాప్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఆయనకు జీవితం లాంటిది, ఎలా నిరూపించుకుంటాడో చూడాలి.
Get ready to celebrate the best of POWERSTAR #UstaadBhagatSingh – Written & directed by @harish2you
This one will be remembered and celebrated for many years.Shoot begins soon ❤
Happy Hanuman Jayanthi ✨
Stay tuned for more updates!@PawanKalyan @harish2you… pic.twitter.com/ob6HYIyXBG
— Ustaad Bhagat Singh (@UBSTheFilm) May 22, 2025