I Bomma Ravi Case: ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారిన ‘I Bomma’ రవి కేసు లో రోజుకి ఒక సంచలన వార్త సోషల్ మీడియా లో లీక్ అవుతూ వైరల్ అవుతున్నాయి. పైరసీ, బెట్టింగ్ యాప్స్ ద్వారా ఇతను సివండ కోట్ల రూపాయలకు పైగా డబ్బులు సంపాదించాడని రీసెంట్ గానే పోలీసుల విచారణ లో తేలింది. అందులో 30 కోట్ల రూపాయిల వరకు ట్రాన్సాక్షన్స్ జరగడాన్ని గుర్తించారు పోలీసులు. ఇక లేటెస్ట్ గా విచారణలో మరో ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఇన్ని రోజులు మనం పైరసీ HD ప్రింట్లకు ముఖ్యమైన ఆధారం ఐ బొమ్మ నే, ఇక్కడి నుండే అన్ని వెబ్ సైట్స్ లకు వెళ్తుందని అంతా అనుకున్నాం. కానీ రవి నేడు పోలీసుల విచారణ లో మాట్లాడుతూ తానూ నేరుగా పైరసీ చేయలేదని, టెలిగ్రామ్, మూవీ రూల్స్, తమిళ్ఏంవీ లాంటి సైట్ల నుండి సినిమాలను కొనుగోలు చేసేవాడిని అంటూ చెప్పుకొచ్చాడు.
క్వాలిటీ తక్కువగా ఉన్న ఆ సినిమాలను టెక్నాలజీ సహాయం తో HD క్వాలిటీలోకి మార్చి ఐ బొమ్మ, బప్పం సైట్లలో అప్లోడ్ చేసేవాడిని అని చెప్పుకొచ్చాడు. పైన అతను చెప్పిన సైట్స్ ఇప్పటికీ రన్నింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. అందరూ ఐబొమ్మ అత్యంత ప్రమాదకరం అని అనుకుంటున్నారు కానీ, పైన వెల్లడించిన సైట్లు అంతకంటే ప్రమాదకరం. విడుదలైన మరుసటి రోజే HD క్వాలిటీ ప్రింట్ ఆ సైట్స్ లో దర్శనం ఇస్తుంది. ఐ బొమ్మ రవి దొరికాడు కాబట్టి, అతని ద్వారా పైన వెల్లడించిన సైట్స్ ఓనర్ల వివరాలు కూడా తెలుస్తాయేమో చూడాలి. ఒకవేళ పోలీసులు ఆ సైట్లను మూసి వేస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పైరసీ బెడద పూర్తిగా వీడినట్టే అనుకోవచ్చు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది. తీగ లాగితే డొంక కదిలినట్టు, ఐబొమ్మ రవి ని పట్టుకుంటే పైరసీ సామ్రాజ్యం మొత్తం కూలే పరిస్థితి వచ్చింది. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి అనేది.