Malvika Mohanan: సౌత్ ఇండియా లో యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్, ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా మాళవిక మోహనన్(Malvika Mohanan) ఉంటుంది. ఈమె ప్రముఖ సినిమాటోగ్రాఫర్ KU మోహనన్ కూతురు. ఇప్పటి వరకు ఈమె తమిళం, మలయాళం ఇండస్ట్రీస్ లోనే ఎక్కువగా సినిమాలు చేస్తూ వచ్చింది. తెలుగు ఆడియన్స్ కి ఈమె ‘మాస్టర్’ అనే తమిళ డబ్బింగ్ చిత్రం ద్వారా పరిచయం. కానీ సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉంటుంది కాబట్టి, ఈమెకు మన తెలుగు ఆడియన్స్ లో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఈమె మొదటి డైరెక్ట్ తెలుగు చిత్రం ‘రాజా సాబ్’. మొదటి సినిమాతోనే ప్రభాస్ లాంటి సూపర్ స్టార్ తో కలిసి నటించడం నిజంగా అదృష్టమే. అలాంటి హీరో తో పని చేసిన అనుభూతి గురించి రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో మాళవిక మోహనన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఆమె మాట్లాడుతూ ‘పెద్ద స్టార్ హీరోల సినిమాల్లో అవకాశం వస్తే, కేవలం నాలుగు సన్నివేశాలు, పాటలకు మాత్రమే మాకు ఛాన్స్ ఉంటుంది. అంతకు మించి ప్రాధాన్యత ఉండదు. రాజా సాబ్ చిత్రం ఆఫర్ వచ్చినప్పుడు నేను అలాగే ఉంటుందని అనుకున్నాను. కానీ డైరెక్టర్ మారుతీ నాకు నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్ర ని ఇచ్చాడు. ప్రభాస్ లాంటి బిగ్గెస్ సూపర్ స్టార్ సినిమాలో ఇలాంటి అద్భుతమైన పాత్ర దొరుకుతుందని అసలు ఊహించలేదు. అలాంటి సూపర్ స్టార్ తో కలిసి నటించడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది’ అంటూ చెప్పుకొచ్చింది మాళవిక మోహనన్. ఈ చిత్రం లో ఆమెతో పాటు నిధి అగర్వాల్ మరియు రిద్ధి కుమార్ లు కూడా హీరోయిన్స్ గా నటించారు. ఈ చిత్రం నుండి ఇప్పటి వరకు విడుదలైన టీజర్, ట్రైలర్ లకు ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.
రీసెంట్ గానే ఈ చిత్రం నుండి విడుదలైన ‘రెబెల్ సాబ్’ పాటకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సంక్రాంతి కానుకగా జనవరి 9 న విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకు సంబంధించిన రెండవ ట్రైలర్ ని త్వరలోనే విడుదల చేయబోతున్నారట మేకర్స్. ఈ ట్రైలర్ మూవీ పై మరింత అంచనాలు పెంచేలా చేస్తాయని అంటున్నారు. రేపటి తో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు మొత్తం కూడా పూర్తి అవుతాయట. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చివరి దశలో ఉందని, త్వరలోనే ప్రొమోషన్స్ ని గ్రాండ్ గా మొదలు పెడుతామని అంటున్నారు మేకర్స్. ప్రస్తుతానికి అయితే ఈ సినిమా పై అంచనాలు మామూలుగానే ఉన్నాయి. రాబోయే రోజుల్లో అంచనాలు పెరగొచ్చు, లేదా తగ్గొచ్చు, చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.