Rana Naidu – Venkatesh : తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించి తనకంటూ మంచి గుర్తింపు ను సంపాదించుకున్న హీరో వెంకటేష్ (Venkatesh)…మొదటిసారి బోల్డ్ డైలాగులను చెబుతూ నటుడు అంటే అన్ని రకాల పాత్రలు చేయాలని ఉద్దేశ్యంతో ‘రానా నాయుడు’ (Rana nayudu) అనే వెబ్ సిరీస్ అయితే చేశారు. ఇక మొదటి సీజన్ భారీ సక్సెస్ ను సాధించడంతో ఇప్పుడు రెండో సీజన్ కూడా రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే రానా నాయుడు మొదటి సీజన్లో మంచి పాత్రను చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటి సుర్విన్ చావ్లా… ఈమె తన ఎంటైర్ కెరియర్లో చాలాసార్లు కాస్టింగ్ కౌచ్ కి గురయ్యానని చెప్పారు. ఒక సినిమా మీటింగ్ కోసం డైరెక్టర్ ని కలవడానికి అతని క్యాబిన్ కి వెళ్లానని ఆ మీటింగ్ పూర్తయిన తర్వాత తను తిరిగి వెళ్ళిపోతుంటే డైరెక్టర్ తన చేయి పట్టి లాగి ముద్దు పెట్టేందుకు ప్రయత్నం చేశాడని, తను మాత్రం అతన్ని వెనక్కి నెట్టేసి అక్కడి నుంచి తప్పించుకున్నానని చెప్పింది. అలాగే ఒక సౌత్ డైరెక్టర్ కూడా తనకు కమిట్మెంట్ ఇవ్వాలని తన ఫ్రెండ్ ద్వారా అడిగించాడు అంటూ ఆమె తన కెరియర్ లో ఎదుర్కొన్న కాస్టింగ్ కౌచ్ ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చింది.
Also Read : రానా నాయుడు’ సీజన్ 2 విడుదల తేదీ వచ్చేసింది..ఈసారి ఎన్ని ఎపిసోడ్స్ అంటే!
మొత్తానికి అయితే నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న కూడా కాస్టింగ్ కోచ్ అనేది ఆమెను చాలా వరకు ఇబ్బంది పెట్టిందని, అదొక పీడకల అంటూ ఆమె గుర్తు చేసుకుంటూ ఉండడం విశేషం… ఇక సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కున్నారు.
వాళ్ళందరూ ఇప్పుడిప్పుడే మీడియా ముందుకు వచ్చి చెబుతూ ఉండడం నిజంగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ గా మంచి గుర్తింపు సంపాదించుకొని ఇండస్ట్రీలో టాప్ లెవెల్ కి వెళ్లిన వారు సైతం కాస్టింగ్ కౌచ్ కి గురైన వారే అంటూ అప్పుడప్పుడు కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇదంతా చూస్తున్న సినిమా ప్రేక్షకులు సైతం ఉలిక్కిపడుతున్నారు.
ఇక వీటివల్లే చాలామంది టాలెంట్ ఉన్న అమ్మాయిలు సైతం సినిమా ఇండస్ట్రీకి రావడానికి భయపడుతున్నారు అని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇక వీటికి చెక్ పెట్టాలని చాలా మంది ప్రయత్నం చేస్తున్నప్పటికి అవి మాత్రం ఆగడం లేదు ఇక రోజు రోజుకి ఇలాంటి ఇబ్బందులకు గురైన హీరోయిన్ల సంఖ్య పెరుగుతూనే వస్తుంది తప్ప తగ్గడం లేదు…